Political News

గులాబీ బాస్ బిగ్ స్కెచ్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఈసారి ఊహించని వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం కమిటీల మార్పుతోనే సరిపెట్టకుండా, పార్టీ అగ్ర నాయకత్వంలోనే ఒక భారీ మార్పుకు గులాబీ బాస్ శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుతం కేటీఆర్ మాత్రమే నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను, ఇప్పుడు మరో కీలక నేతకు కూడా కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

సాధారణంగా బీఆర్‌ఎస్‌లో నిర్ణయాలన్నీ కేసీఆర్, కేటీఆర్ చుట్టూనే తిరుగుతుంటాయి. దీనివల్ల ప్రతిపక్షాల నుంచి వచ్చే కుటుంబ పార్టీ అనే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో పాటు, రాష్ట్రంలో మారుతున్న సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌కు సమాంతరంగా, ఆయనతో సమానమైన అధికారాలు ఉండేలా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలోనే ఈ కొత్త నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త పవర్‌ సెంటర్‌ను ఒక బలమైన బీసీ సామాజికవర్గ నేతతో భర్తీ చేయాలనేది గులాబీ అధిష్టానం అసలు ప్లాన్. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంక్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీల విషయంలో ఒత్తిడి పెంచడంతో పాటు, తాము వెనుకబడిన వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని నిరూపించుకోవడానికి కేసీఆర్ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కేటీఆర్ లాంటి హైప్రొఫైల్ నేత పక్కన ఒక బీసీ లీడర్‌ను కూర్చోబెట్టడం ద్వారా అటు సామాజిక సమీకరణాలు, ఇటు రాజకీయ అవసరాలు రెండింటినీ ఒకే దెబ్బకు సాధించవచ్చనేది బీఆర్‌ఎస్ అంతర్గత వ్యూహం.

త్వరలోనే హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పట్టున్న నేతకే ఈ లక్కీ ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రేస్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గ్రేటర్ సమన్వయకర్తగా ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆయనకు ఈ పదవి ఇస్తే మైలేజ్ వస్తుందని ఒక వర్గం భావిస్తోంది.

ఆయనతో పాటు ఉత్తర తెలంగాణ నుంచి గంగుల కమలాకర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, అలాగే సీనియర్ నేతలు మధుసూదనా చారి, దాసోజు శ్రవణ్ పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు టాక్. మరి ఈ సంచలన పదవిని దక్కించుకుని, గులాబీ పార్టీలో సెకండ్ పవర్ సెంటర్‌గా నిలిచే ఆ లక్కీ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

This post was last modified on June 7, 2026 7:18 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

19 minutes ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago