Movie News

దూత మీద నమ్మకం నిర్మాతను చేసింది

హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు మీద కనిపించినా వెనుక ఉన్నది మెగాస్టారన్నది ఓపెన్ సీక్రెట్. ఏఎన్ఆర్ ఉన్నప్పుడే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకునేవారు. వెంకటేష్ కు నేరుగా కాకపోయినా అన్నయ్య సురేష్ బాబు రూపంలో నిర్మాణం మీద ముందు నుంచి పట్టుంది. బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ లో పార్ట్ నర్ గా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటి జనరేషన్ లో ఇలా రిస్కు చేస్తున్న హీరోలు తక్కువే. వాల్ పోస్టర్ బ్యానర్ పెట్టిన మెల్లగా న్యాచురల్ స్టార్ నాని దాని రేంజ్ పెంచే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు జిఎంబి పేరు మీద మేజర్ లాంటి ప్రాజెక్టు చేశారు. కిరణ్ అబ్బవరం ఇటీవలే ప్రొడ్యూసర్ రోల్ లోకి వచ్చేశాడు. నాగ శౌర్య లాంటి వాళ్లకు ఫ్యామిలీ బ్యానర్ అండదండలు ఎలాగూ ఉన్నాయి. ఇప్పుడీ లిస్టులో నాగచైతన్య చేరబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో మూడేళ్ళ క్రితం వచ్చిన దూత వెబ్ సిరీస్ సీజన్ 2తో నిర్మాతగా కొత్త పాత్రలోకి ప్రవేశించబోతున్నాడు.

ఈ మేరకు ఇవాళ పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ చేశారు. గెస్టుగా నాగార్జున కూడా వచ్చారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ థ్రిల్లర్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కు రావొచ్చు. ఎందుకంటే చైతు ప్రస్తుతం వృషకర్మలో బిజీగా ఉన్నాడు. అది రిలీజయ్యాక దూత 2 సెట్స్ లో అడుగు పెట్టొచ్చు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా మొదటి భాగంలో నటించిన కొందరు కీలక ఆర్టిస్టులు ఇందులో పాలు పంచుకోబోతున్నారు.

చైతు చేయబోతున్న ఈ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతోందో చూడాలి. శోభితని పెళ్లి చేసుకున్నాక కెరీర్ పరంగా రూటు మారుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇవి ఫలితాలు ఇస్తే మంచిదే. నిర్మాతగా తన ముద్ర ఎలా ఉండబోతోందనేది దూత 2తో బయట పడనుంది. ఇదే కాదు త్వరలో సినిమా నిర్మాణంలోకి కూడా నాగచైతన్య అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. తండ్రి నాగ్, తమ్ముడు అఖిల్. మామ వెంకటేష్ తో పాటు రానా తదితరులంతా ఫ్యామిలీలోనే ఉన్నారు. సో లైనప్ బాగా ప్లాన్ చేసుకోవచ్చు.

This post was last modified on June 5, 2026 4:08 pm

Share

Recent Posts

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

38 minutes ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

1 hour ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

2 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

3 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

4 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

5 hours ago