Movie News

కొత్త నిప్పు రాజేసిన వీరభద్రుడు

ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో మూడు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న కరుప్పు అలియాస్ వీరభద్రుడు ఇప్పుడో కొత్త నిప్పు రాజేశాడు. ఇటీవలే దర్శకుడు ఆర్జె బాలాజీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలుసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట కరుప్పు విజయ్ కే వెళ్లిందని, ఆయన చివరి మూవీ ఇదైతే బాగుంటుందనే ఉద్దేశంతో కథ చెప్పానని అన్నాడు.

ఇక్కడిదాకా బాగానే ఉంది ఎడిటర్ కలైవనన్ మరో సందర్భంలో మాట్లాడుతూ ఒకవేళ కరుప్పు విజయ్ కనక చేసి ఉంటే మరో స్థాయిలో ఉండేదని, బ్లాస్ట్ అయ్యేదన్న రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఇది కాస్తా సూర్య అభిమానులకు ఆగ్రహం కలిగించింది. కేవలం విజయ్ వద్దు అన్నందుకు వేరే ఆప్షన్ లేక సూర్యతో తీశారని, లేదంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అర్థం వచ్చేలా పైన రెండు స్టేట్ మెంట్లు ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఇదో కాంట్రావర్సీకి దారి తీసింది.

ఇదంతా గమనించిన సూర్య నేరుగా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ప్రేమతో ఉండండి అంటూ ఒక సాధారణ ట్వీట్ వేయడం ఇంకో చర్చకు దారి తీసింది. ఇది ఎక్కడికో వెళ్తుందని గుర్తించిన కలైవనన్ తన తప్పును సరిదిద్దుకుంటూ నేను అన్నది ఇంకో అర్థంలో వెళ్లిపోయిందని, మరోసారి ఇలా నోరు జారకుండా చూసుకుంటానని వివరణ ఇవ్వడం ఫైనల్ ట్విస్టు. ఆర్జె బాలాజీ సైతం సూర్య తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడిగా పలు సందర్భాల్లో వర్ణిస్తూ ఉంటారు.

అయినా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినప్పుడు హీరోని పొగుడుకోవాలే కానీ ఫలానా వాళ్ళు చేస్తే ఇంకా బాగుండేదని చెప్పడం ముమ్మాటికీ తప్పే. పైగా సూర్య కరుప్పుకి పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్ లో దేవుడిగా పూనకంతో చేసిన డాన్స్ అందరికీ నప్పేది కాదు. పైగా ఎంత విజయ్ అయినా ఆ స్థాయిలో చేయగలడా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల దాకా వసూలు చేసిన వీరభద్రుడు తాజాగా రిలీజైన పెద్ది వల్ల ఫైనల్ రన్ కు వచ్చేసింది.

This post was last modified on June 5, 2026 1:02 pm

Share

Recent Posts

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

17 minutes ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

1 hour ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

2 hours ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

5 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

7 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

7 hours ago