Political News

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే జనసేన హైదరాబాద్‌లో మీటింగ్ పెడతానని ప్రకటించడం.. అంతకు ముందు కొద్ది రోజులుగా సాగుతున్న వివాదాలు.. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి మొదలైంది.

పవన్ ప్రెస్‌మీట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో అన్నీ అలర్ట్ అయ్యాయి. అనుకూలంగానో, వ్యతిరేకంగానో.. ఏదో రకంగా స్పందిస్తున్నాయి. కొన్ని పార్టీల ముసుగులు కూడా తొలగిపోతున్నాయి. 2029 ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పనిలోపనిగా తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు అంటూ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని అన్నారు. ఇక్కడ తనతో కలిసి బీజేపీ నడుస్తుందో లేదో అని కూడా సందేహం వ్యక్తం చేశారు.

వెంటనే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆ వెంటనే కోమటిరెడ్డి సైతం మాట్లాడారు. మరోవైపు కవిత, కేటీఆర్ కూడా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వీరంతా వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా ఒకే ఒక అంశంపై గట్టిగా స్పందించారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరే అంటూ తేల్చి చెప్పారు.

తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం దీనిపై స్పందించకపోయినా, ఏపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ మీటింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టారు. ముఖ్యంగా ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పందించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదని హితవు పలికారు.

మరోవైపు వైసీపీ కూడా నిన్న పవన్ వ్యాఖ్యలపై స్పందించింది. వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ చేసిన కామెంట్లను ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. అయితే ఈ అంశంపై వైసీపీ కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది. మిగిలిన ముఖ్య నేతలు ఎవరూ దీనిపై పెద్దగా స్పందించకపోవడం గమనించాల్సిన అంశం.

ఇక స్పందించాల్సింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు మాట్లాడిన తర్వాత కూడా పవన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలంగాణపై పోస్టులు చేశారు. మహాకవి శేషేంద్ర శర్మ కవిత్వాన్ని ఆయన ఉటంకించారు.

“జై తెలంగాణ, జై భారత్, జై హింద్” అంటూ కూడా పోస్టు చేశారు. ఇప్పటికే తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో పాటు మజ్లిస్ పార్టీ కూడా ఉంది. కొత్తగా కల్వకుంట కవిత పార్టీని ప్రారంభించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉనికి ఎలా ఉండబోతోంది…? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దీనిపై ఎలా స్పందించబోతోంది అనే అంశాలు ఆసక్తిగా మారాయి.

Kumar

Recent Posts

అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…

31 minutes ago

అల్లు అర్జున్ 23… ఇబ్బందేం లేదు!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…

1 hour ago

ఔను… ర‌జినీ సినిమాకు మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు మారాడు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఒక సినిమా తీయాల‌ని ఏడాది కింద‌ట్నుంచి ప్ర‌య‌త్నాలు…

1 hour ago

ఢిల్లీలో చర్చలు.. భారత్ పై కొత్త పన్నులు.. ట్రంప్ డబుల్ గేమ్!

భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు…

2 hours ago

డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్‌వీర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో…

3 hours ago

టెన్షన్ పెట్టిన ‘పెద్ద’ మల్టీప్లెక్సులు

ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నప్పుడు నిర్మాతకు ఫలితం కన్నా ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో…

3 hours ago