Political News

నాని మాటలకు యాక్షన్ తోడైంది!

కొడాలి శ్రీవేంకటేశ్వర రావు అలియాస్ కొడాలి నాని.. నోరు తెరిస్తే వైరి వర్గాలపై ఘాటు వ్యాఖ్యలు పడిపోతాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై తనకేదో వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్లుగా సాగే నాని… ఆ ఇద్దరు నేతలపై ఓ రేంజిలో ఫైరవుతూ ఉంటారు.

వైసీపీ ఓటమి పాలయ్యాక పెద్దగా కనిపించని నాని.. టీడీపీ వార్షిక వేడుక మహానాడు జరుగుతున్న బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ అదినేత నిర్వహించిన కీలక సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన… పనిలో పనిగా చంద్రబాబు, లోకేశ్ లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇప్పటిదాకా మాటలతోనే విమర్శలు సంధించిన నాని… తాజాగా తన మాటలకు తన యాక్షన్ ను కూడా జత చేసి ఆకట్టుకున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుందన్న నాని… ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ ను సూపర్ సున్నాను చేశారని ఆయన సెటైరిక్ విమర్శలు సంధించారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు, లోకేశ్ లు చేసింది రెండే రెండు పనులని చెప్పిన నాని… వాటిలో ఒకటి మోదీ కనిపిస్తే వంగివంగి దండాలు పెట్టడం, రెండోది పవన్ కల్యాణ్ కనిపిస్తే కూర్చోవడమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీ కనిపిస్తే చంద్రబాబు, లోకేశ్ లు ఇలా వంగి దండాలు పెడతారని చెప్పిన నాని… వారెలా వంగుతారన్న అంశాన్ని చెప్పేందుకు తానూ వంగి మరీ చూపించారు. ఇక పవన్ కల్యాణ్ కనిపిస్తే చంద్రబాబు, లోకేశ్ లు కూర్చుంటున్నారని చెప్పిన నాని… వారెలా కూర్చుంటారన్న దానిని యాక్షన్ లో తాను కూర్చుని మరీ చూపించారు. ఈ దృశ్యాలు చూసిన వారంతా… నాని ఇప్పటిదాకా తన నోటికి మాత్రమే పని చెప్పారని, కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆ మాటలకు యాక్షన్ ను కూడా జత చేసి చూపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

మోదీ కంటే వయసులో చంద్రబాబే పెద్దవారని చెప్పిన నాని… తనకంటే చిన్నవారైన మోదీ ముందు చంద్రబాబు ఎందుకు మోకరిల్లాలని ప్రశ్నించారు. ఇతర పార్టీల మద్దతు లేకుండా ముందుకు కదలలేని స్థాయికి టీడీపీని దిగజార్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే… చంద్రబాబు ఆ పార్టీని తన మనుగడ కోసం ఇతర పార్టీల వద్ద తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. హైబ్రిడ్ పద్ధతిలో టీడీపీ మహానాడు జరుగుతున్న తీరుపైనా నాని తనదైన శైలి సెటైర్లు సందించారు. విపక్షంలో ఉన్న వైసీపీ 175 మంది ఇంచార్జీలతో సమావేశం ఏర్పాటు చేస్తే… టీడీపీ మహానాడును కూడా గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. మొత్తంగా నాని చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on May 27, 2026 10:30 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

15 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

22 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago