Political News

నాడు నిందితుడిగా!… నేడు ముఖ్యమంత్రిగా!

అప్పటిదాకా తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా కొనసాగిన దళపతి విజయ్… తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ పెట్టి… అనతి కాలంలోనే రికార్డులు బద్దలు కొడుతూ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరిన విజయ్…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర ప్రస్థానంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనది ఒకటి ఉంది. రెండు నెలల క్రితం ఓ కేసు విచారణ కోసం ఢిల్లీకి వచ్చిన విజయ్… నేడు సీఎం హోదాలో అదే ఢిల్లీలో అడుగుపెట్టారన్న ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది.

రెండేళ్ల క్రితంమే రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్…తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పార్టీ సభలు పెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో తొక్కిసలాట జరగగా… 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేయగా… కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసు విచారణ కోసం రెండు నెలల క్రితం విజయ్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ అదికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

కట్ చేస్తే… బుధవారం విజయ్ మరోమారు ఢిల్లీలో అడుగుపెట్టారు. మునుపటి సారి నిందితుడిగా విచారణకు వెళ్లిన విజయ్… తాజా పర్యటనలో మాత్రం తమిళనాడు సీఎం హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తమిళనాడు హౌస్ లో విజయ్ కి పౌలీసుల గౌరవ వందనం దక్కింది. తమిళనాడు సీఎం హోదాలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకే విజయ్ ఢిల్లీ వచ్చారు.

అనంతరం ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. విజయ్ ఢిల్లీ పర్యటనను వీక్షిస్తున్న జనం.. రెండు నెలల క్రితం ఇదే విజయ్ ఓ నిందితుడిగా సీబీఐ విచారణకు వచ్చారని వారు విశ్లేషిస్తున్నారు. రెండంటే రెండు నెలల్లో విజయ్ విషయంలో ఎంత మార్పు వచ్చిందో కదా అన్న చర్చ సాగుతోంది.

This post was last modified on May 27, 2026 10:27 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago