Movie News

శాంతించిన ఎగ్జిబిటర్లు… టెన్షన్లకు బ్రేకులు

నైజామ్ సింగల్ స్క్రీన్లలో తక్షణం పర్సెంటెజ్ విధానం అమలు చేయాలని పట్టువదలకుండా పోరాడుతున్న ఎగ్జిబిటర్లు చిరంజీవి ప్రమేయం తర్వాత శాంతించారు. రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు జరిగిన సమావేశాల ద్వారా మెగా హామీ దొరకడంతో పెద్దికి దారి వదిలారు. అంటే ఈ సినిమాతో పాటు జూన్ లో వచ్చే ఇతర చిత్రాలు రెంటల్ పద్దతిలోనే ఆడతాయి. కమిటీ ఇచ్చే రిపోర్ట్ అనుగుణంగా జూలై 3 నుంచి పర్సెంటెజ్ విధానాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకురానున్నారు.

ఓపికగా ఎగ్జిబిటర్ల సమస్యలను సావధానంగా విన్న చిరంజీవి వాటిని నెరవేర్చే విధంగా తన వంతుగా చేయగలిగింది చేస్తానని, ఇలా హఠాత్తుగా ఇప్పటికిప్పుడు సిస్టమ్ లో మార్పులు చేయడం కష్టం కాబట్టి ఆ మేరకు సర్దిచెప్పడంతో మీటింగ్ కు హాజరైన సభ్యులు కన్విన్స్ అయినట్టుగా తెలిసింది. ఒకవేళ ఏపీలో కనక టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వస్తే ఆ మేరకు అద్దెతో పాటు ఏడున్నర శాతం అదనంగా చెల్లించే వెసులుబాటుకి అంగీకారం వచ్చినట్టుగా తెలిసింది.

ఏదైతేనేం చిక్కుముడి వీడింది. నిన్న ఏపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని నిర్మాతలు కలిసి వచ్చిన తర్వాత ఇవాళ జరిగిన తాజా పరిణామాలు ఇవి ఎగ్జిబిటర్లు చిరు ప్రమేయం పట్ల సంతోషంగానే ఉన్నారు. వాళ్ళుగా కోరుకున్న చొరవ కాబట్టి ఆ మేరకు మెగాస్టార్ కూచోబెట్టుకుని సావధానంగా పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఇక గత వారం ఛాంబర్ నియమించిన కమిటీ ఇవ్వబోయే రిపోర్ట్ చాలా కీలకం కానుంది. వాటి రికమండేషన్ ఆధారంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి.

ఇంకొక్క వారంలో పెద్ది రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో భారీ సెలబ్రేషన్స్ కు రంగం సిద్ధం అయినట్టే. ఈ మొత్తం ఇష్యూలో మరిన్ని సినిమాలు లాభపడబోతున్నాయి. ముఖ్యంగా సమంత మా ఇంటి బంగారం, అఖిల్ లెనిన్ విడుదల జూన్ లోనే కాబట్టి కొత్తగా రాబోయే కండీషన్ల పరిధిలోకి తీసుకోరు. జూలై నుంచి అంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ఏ పెద్ద హీరో సినిమా అయినా పర్సెంటెజ్ విధానంలో వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కథ సుఖాంతమయ్యింది.

This post was last modified on May 27, 2026 10:06 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

8 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

15 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago