టీడీపీ వార్షిక వేడుక మహానాడు రెండో రోజైన గురువారం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులతో జరుగుతున్న ఈ వేడుకలు హైబ్రిడ్ పద్ధతిన జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన పార్టీ నేతలు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గురువారం మహానాడు వేదిక మీద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ జెండర్ వర్ణిణీ నేరుగా వేదిక ఎక్కి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుని కనిపించారు.
తన పక్కన కూర్చున్న ట్రాన్స్ జెండర్ వర్షిణితో చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆత్మీయ పలకరింపుతో వర్షిణి భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదవికి పీఏగా పనిచేస్తున్న వర్షిణి… విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. టీడీపీ అంటే ఎనలేని అభిమానం కలిగిన వర్షిణి తాను చంద్రబాబును కలవాలనుకుంటున్నానని చెప్పగా… ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… మహానాడు వేదిక మీద కూర్చున్న చంద్రబాబు…పార్టీకి చెందిన అతి సామాన్య కార్యకర్తలతో కూడా ముచ్చటిస్తూ సాగుతున్నారు. పార్టీ కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక అన్న మాదిరిగా సాగుతున్న చంద్రబాబు… తనను కలిసేందుకు వస్తున్న కార్యకర్తలను ఎంతమాత్రం నిరాశకు గురి చేయకుండా సాగుతున్నారు. పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సాగుతున్న చంద్రబాబు…వారిలో మరింత ధైర్యాన్ని నింపుతున్నారు.
This post was last modified on May 28, 2026 12:28 pm
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…