Political News

మంగళగిరిలో ‘గొడ్డలి’… తాడేపల్లిలో ‘వెన్నుపోటు’

ఏపీలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయానికి బుధవారం నాడు ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. విపక్ష వైసీపీకి గొడ్డలి పార్టీ అంటూ అధికార టీడీపీ కొత్త పేరును పెడితే… వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ టీడీపీ పాలనపై వైసీపీ తనదైన శైలి సెటైర్లు సంధించింది. టీడీపీ వార్షిక వేడుక వేదిక మీడ నుంచి వైసీపీని తూలనాడుతూ చంద్రబాబు ప్రసంగం చేస్తే.. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోందని, ఈ రెండేళ్లలో టీడీపీ ఎన్నో వెన్నుపోట్లు పొడిచింది అంటూ వైసీపీ ఏకంగా ఓ బుక్కును రిలీజ్ చేసింది. వెరసి బుధవారం నాడు ఈ రెండు పార్టీల మధ్య సెటైరికల్ వార్ జరిగిందని చెప్పాలి.

టీడీపీ ఏటా నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుక మహానాడు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత హోదాలో సీఎం నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షోపన్యాసంతో మహానాడు ప్రారంభం కాగా… ప్రారంభోపన్యాసంలోనే వైసీపీపై గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చంద్రబాబు సెటైర్లు సంధించారు.

వైసీపీని గొడ్డలి పార్టీ అని ఆయన సంబోధించారు. వేట కొడవళ్ల సంస్కృతి నుంచి వైసీపీ గొడ్డలి చేతబట్టే పార్టీగా ఎదిగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా వైసీపీ,. టీడీపీల మధ్య వ్యత్యాసాలను ఆయన తనదైన శైలి సెటైరిక్ డైలాగులతో వివరించి తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించారని చెప్పాలి.

ఇక మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి ఓ సన్నాహక సమావేశాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన జగన్.. ఎన్నికలు పూర్తి అయ్యాక వాటిని టీడీపీ చెత్తబుట్టలో పడేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.

ప్రజలకు టీడీపీ వెన్నుపోటు పొడిచిందని, ఈ వెన్నుపోట్లను వివరిస్తూ ఓ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరును ఆ పుస్తకానికి పెట్టామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రతి కార్యకర్త వద్ద ఉండాలని కూడా జగన్ అభిలషించారు. మొత్తంగా అటు వైపు నుంచి గొడ్డలి పార్టీ అని వినిపిస్తే… ఇటు వైపు నుంచి వెన్నుపోటుకు రెండేళ్లు అనే మాట వినిపించింది.

This post was last modified on May 27, 2026 2:56 pm

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

10 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

11 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago