Trends

ఈ రమణ… ఆరిపోతున్న దీపాలకు వెలుగు!

నిజమే. తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన వెంకటరమణ జీవితం… ఆరిపోతున్న దీపాలకు వెలుగేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. పుట్టినప్పటి నుంచి కాలు బయటపెట్టిందే లేదు… కూర్చున్నది లేదు.. నడిచిందీ అసలే లేదు.. స్కూలుకు వెళ్లింది లేదు.. అయితేనేం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అతడు ఉద్యోగం చేస్తున్నాడు. తనకు కలిగిన జీవితకాల వైకల్యాన్ని అతడు తనకు శాపంగా పరిగణించలేదు. తనకు వచ్చిన వైకల్యాన్ని చూసి భయపడనూ లేదు. గుండె నిబ్బరంతో జీవితం సాగించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న దానికంటే కూడా అధికంగానే జీవితాన్ని పరుగు పెట్టిస్తున్నాడు.

ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న వెంకట రమణ.. పుట్టుకతోనే ఓ అరుదైన బోన్ మారో వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ జబ్బు కారణంగా అతడు ఇప్పటిదాకా పడక నుంచి లేచిందే లేదు. కాళ్లు, చేతులు కూడా ఎదగలేదు. శరీరమూ ఎదగలేదు. కాని మస్తిస్కం మాత్రం అతడితో పాటు వేగంగా ఎదిగింది. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని రమణ… నానామ్మ చెప్పిన పాఠాలతో విద్యాబుద్ధులు నేర్చాడు. ఆపై కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఓ ట్యూటర్ ద్వారా పదో తరగతి పాసయ్యాడు. అక్కడితోనే రమణ ఆగలేదు. అన్నీ ఆన్ లైన్ ద్వారానే నేర్చుకున్నాడు. ఇప్పుడు ఉద్యోగాన్ని కూడా వర్క్ ఫ్రం హోం ద్వారానే చేస్తున్నాడు.

ఈ రమణను జాతీయ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఇంటర్వ్యూ చేసింది. అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదంటూ నిత్యం మదనపడిపోతూ… ఏదో బలహీన క్షణంలో జీవితాలనే తీసుకుంటున్న వారికి సరికొత్త ఊపిరిలూదే రీతిలో రమణ జీవితాన్ని ఆ సంస్థ కళ్లకు కట్టింది. ఇప్పటికీ ఎక్కడ ఉన్నా పడుకున్న స్థితిలోనే కనిపించే రమణ… సెల్ ఫోన్ ను పట్టుకునేందుకూ చేత కాకున్నా… దానిని తన చిన్నారి చేతులతో ఆపరేట్ చేస్తూ సాగుతున్నాడు. ఈ రమణ జీవితం ఎందరికో ఆదర్శం కావాలని మనమూ ఆశిద్దాం.

This post was last modified on May 27, 2026 2:54 pm

Share

Recent Posts

చాప కింద నీరులా 100 కోట్లు కొల్లగొట్టింది

ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…

30 minutes ago

సుప్రీం ఆదేశాలు… నామినేషన్ల గడువు పెరుగుతుందా?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి…

41 minutes ago

పెద్దోళ్ళు తీసిన దెయ్యాలు ప్రేక్షకులని భయపెడతాయా

మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. అయితే ఈ ఇద్దరూ…

48 minutes ago

ఏటిగట్టు ఇంకో ఆప్షన్ వైపు చూస్తోందా

సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి.…

2 hours ago

రావణుడు హైలైట్ అయితే ఇబ్బందే

ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…

2 hours ago

ఏపీ లోక‌ల్ వార్‌… జ‌గ‌న్ తెలుసుకోవాల్సింది ఇదే.. !

స్థానిక ఎన్నిక‌ల సమ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జరిగింది 25 శాతం మాత్ర‌మే!. మునిసిపాలిటీలు, మునిసిప‌ల్ కార్పొరే ష‌న్ల‌కు మాత్ర‌మే ఎన్నిక‌ల…

4 hours ago