Political News

ఈసారి మహానాడు స్పెషల్ బ్రో

ఏపీలో అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తన వార్షిక వేడుక మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం మొదలుకానున్న ఈ వేడుక రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ఏటా ఏదో ఒక ప్రాంతంలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తల సమక్షంలో జరిగే ఈ వేడుక… ఈ సారి మాత్రం హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతోంది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు పాటిస్తూ మహానాడును ఈ దఫా ఆన్ లైన్ వేదికగా నిర్వహిద్దామన్న పార్టీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని యావత్తు పార్టీ కేడర్ ఆహ్వానించింది.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో జరిగే ఈ వేడుకలను రాష్ట్రం మొత్తం క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేస్తున్న బిగ్ స్క్రీన్ల ద్వారా ప్రసారం చేస్తారు. ఆయా గ్రామాల పార్టీల కార్యకర్తలు తమ క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని మహానాడు వేడుకలను తిలకిస్తారు. అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలో అందరికంటే ముందు ఉండే చంద్రబాబు…ఈ దఫా మహానాడును హైబ్రిడ్ వేదికగా జరపాలని నిర్ణయించిన తీరు నిజంగానే ఆహ్వానించదగ్గదని చెప్పాలి.

ఇక ఈ మహానాడు వేడుకకు చాలా ప్రత్యేకతలున్నాయని చెప్పాలి. తొలిసారి హైబ్రిడ్ వేదికగా జరుగుతున్న మహానాడు ఇదేనట. అంతేకాకుండా పార్టీ కీలక నేత, మంత్రి నారా లోకేశ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ కారణంగా ఈ వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ప్రత్యేకమైనవిగా భావిస్తున్నాయి.

పార్టీలో మూడో తరం నేత పార్టీలో ఓ కీలక స్థాయిని అందుకున్న తర్వాత జరుగుతున్న ఈ వేడుకల సందర్భంగా విజయవాడకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మంగళగికి సమీపంలో కృష్ణా నది తీరంలో సీతమ్మ వారి పాదాల చెంత ఆయన ఓ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. పార్టీలో మూడు తరాల నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు… వారిలో నుంచి దూసుకువస్తున్న నారా లోకేశ్ ఫొటోలతో కూడిన ఈ కటౌట్ ఎత్తు 150 అడుగులట. దీని కోసం వెంకన్న ఏకంగా రూ.18 లక్షలు వెచ్చించారట. ఈ కటౌట్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.

This post was last modified on May 26, 2026 11:49 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

37 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago