Political News

విజయ్ కి వద్దన్నా పెరుగుతున్న మద్దతు

ఎక్కడైనా అదికార పార్టీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను లాగేందుకు తనదైన శైలి అస్త్రాలను ప్రయోగిస్తుంది. అయితే తమిళనాట జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీ ఫిరాయింపుల కిందకు రావనే చెప్పాలి. ఎందుకంటే.. అక్కడ కొత్తగా అదికారం చేపట్టిన విజయ్ పార్టీ టీవీకేకు వద్దన్నా మద్దతు పెరుగుతోంది. విజయ్ పిలవకున్నా కూడా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు… తమ పదవులతో పాటు పార్టీలకూ రాజీనామాలు చేసి మరీ విజయ్ చెంతకు చేరుతున్నారు. ఈ తరహా పరిణామాలతో ప్రత్యేకించి అన్నాడీఎంకేకు తీరని నష్టం జరుగుతోందని చెప్పక తప్పదు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కాస్తంత దూరంలో టీవీకే నిలవగా… తాము మద్దతు ఇస్తామంటే తాము ఇస్తామని పలు పార్టీల నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ తన విశ్వాస పరీక్షను అతి సులువుగా నెగ్గేశారు. ఇప్పుడు ఇతర పార్టీల నేతలు ఆయనకు అవసరం లేదు. అసలు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆయన ఆహ్వానించడమూ లేదు. అయినా కూడా రాజకీయాల్లో తలలు పండిన వారిలో చాలా మంది తమ భవిష్యత్తును చూసుకుని విజయ్ చెంత చేరిపోతున్నారు.

అన్నాడీఎంకే ఇక అధికారం చేజిక్కించుకునే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇదే విషయాన్ని గ్రహించిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సత్యభామ, మరగథమ్, జయ కుమార్ లు సోమవారం అన్నాడీఎంకేతో పాటు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత వారు నేరుగా విజయ్ వద్దకు చేరి టీవీకేలో చేరిపోయారు. వారి రాజానామాలో వారి నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో వారంతా టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించేందుకు సిద్ధపడిపోయారు.

ఇక తాజాగా మంగళవారం మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఆ ముగ్గురి బాటలోనే సాగారు. అన్నాడీఎంకే తరఫున మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బయ్య మంగళవారం అన్నాడీఎంకే సత్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయన కూడా పై ముగ్గురి మాదిరిగానే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. సుబ్బయ్య కూడా త్వరలోనే విజయ్ సమక్షంలో టీవీకేలో చేరి… తన నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రభాకర్ ఆమోదించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు…తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లోనే సమర్పించారు. దీంతో వారి రాజీనామాలను స్పీకర్ వెనువెంటనే ఆమోదించారు. తాజాగా సుబ్బయ్య కూడా వారి బాటలోనే స్పీకర్ ఫార్మాట్ లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకూ త్వరలోనే ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాట విజయ్ కు వద్దన్నా మద్దతు పెరిగిపోతోందని చెప్పాలి.

This post was last modified on May 26, 2026 7:10 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

44 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago