Political News

పవన్ తో అరవ శ్రీధర్ భేటీ… మ్యాటరేంటి?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీలో అరవ శ్రీధర్… జనసేన తరఫున విప్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి రాజీనామా చేసిన శ్రీధర్.. రాజీనామా పత్రాన్ని పవన్ చేతిలో పెట్టారు. ఇందుకోసమే ఆయన పవన్ ను కలిసినట్టుగా సమాచారం.

పనిలో పనిగా… తనపై వచ్చిన ఆరోపణలకు సంబందించి శ్రీధర్… పార్టీ అధినేతగా ఉన్న పవన్ కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. శ్రీదర్ ఇచ్చిన వివరణను పవన్ అంగీకరించారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే… విప్ పదవికి శ్రీధర్ చేసిన రాజీనామాను మాత్రం పవన్ ఆమోదించారు. ఫలితంగా శ్రీధర్ కు పార్టీ అందించిన విప్ పదవి ఊడిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా జనసేనకు చెందిన మరో నేతకు కొత్తగా అవకాశం దక్కినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కున్న శ్రీధర్.. ఆ మహిళ ఓపెన్ అప్ అవ్వడంతో అడ్డంగా బుక్కయ్యారు. విడతలవారీగా సదరు మహిళ శ్రీధర్ కు సంబందించిన వీడియోలను విడుదల చేయడంతో పాటుగా తనకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

తాజాగా ముస్లిం మహిళల పట్ల శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను కూడా బాధిత మహిళ విడుదల చేయడంతో శ్రీధర్ మరింతగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఫలితంగా విప్ పదవికి ఆయన రాజీకాయా చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి శ్రీధర్ వ్యవహారంపై వేగంగానే స్పందంచిన పవన్ కల్యాణ్… ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఈ వ్యవహారానికి సంబందించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక అందిన తర్వాతే విప్ పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిందని… ఆ మేరకే శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 23, 2026 2:55 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

2 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

7 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

8 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

9 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

11 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

12 hours ago