Political News

విజయ్ సలహాదారుగా వైఎస్ అనిల్ రెడ్డి వ్యాపార భాగస్వామి?

తమిళనాడులో అవినీతి రహిత పాలన అందిస్తానంటూ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి దిగిపోయిన జోసెఫ్ విజయ్ ఇప్పటికే ఒకటి, అరా విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా తాను తప్పటడుగులు వేశానని ఒప్పుకున్న విజయ్ ఆ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. తాజాగా మరో తప్పటడుగు విజయ్ వేశారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తమిళనాడు సీఎం విజయ్ కు సలహాదారుగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి వ్యాపార భాగస్వామిగా ఉన్న విష్ణు రెడ్డి నియమితులయ్యారన్నదే ఆ వార్తల సారాంశం. అనిల్ తో బిజినెస్ పార్టనర్ గా ఉన్న విష్ణు రెడ్డి కూడా తెలుగువారే. వెరసి తమిళనాడు సీఎంకు ఓ తెలుగోడు సలహాదారుగా నియమితులయ్యారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విష్ణు రెడ్డికి సంబంధిన వ్యవహారాలు అంతగా తెలియకున్నా… ఆయన బిజినెస్ పార్టనర్ వైఎస్ అనిల్ రెడ్డి అని తెలియడంతో ఈ నియామకంపై విమర్శలు రేకెత్తుతున్నాయి. అనిల్ రెడ్డి.. జగన్ కు పెదనాన్న కొడుకుగా చెబుతారు. ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో అనిల్ పేరు ఓ రేంజిలో వినిపించింది.

అనిల్ ఇళ్లు, కార్యాలయాలను కూడా ఏపీ సీఐడీ అదికారులు శోధించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారని గతంలో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఏపీ లిక్కర్ కుంభకోణంలో అనిల్ కీలక భూమిక పోషించారని కూడా సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

మొత్తంగా ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక భూమిక పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ వ్యాపార భాగస్వామి విష్ణు రెడ్డిని విజయ్ తన ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ జార్జి రెడ్డి కుటుంబానికి చెందిన ఓ వివాహ వేడుక చెన్నై నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి జగన్ సహా వైసీపీ పెద్దలంతా హాజరు కాగా…టీవీకే ఛీప్ హోదాలో విజయ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. జగన్ తో విజయ్ కలిసి ఉన్న ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వేడుకలో వైఎస్ అనిల్ రెడ్డి అన్నీ తానైనట్లుగా వ్యవహరించారు. అప్పటికే అనిల్ తో వ్యాపార భాగస్వామ్యం కలిగిన విష్ణు రెడ్డి కారణంగానే విజయ్ ఈ వేడుకకు హాజరయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ సర్కారులో సలహాదారుగా విష్ణు రెడ్డి నియమితులయ్యారన్న వార్తలు ఇప్పుడు తమిళనాట పెను చర్చకే తెర తీశాయి. బీజేపీకి చెందిన తమిళ నేత సెల్వ కుమార్ మాత్రం ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టే పెట్టారు.

ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అనిల్ రెడ్డితో వ్యాపార భాగస్వామ్యం ఉన్న విష్ణు రెడ్డిని విజయ్ తన సలహాదారుగా నియమించుకున్నారని ఆయన తన పోస్టులో ఆరోపించారు. అవినీతి రహిత పాలనను అందిస్తానని అధికారంలోకి వచ్చిన విజయ్… తన మాటను పక్కనపెట్టి ఇలా ఇప్పటికే అవినీతి కార్యకలాపాల్లో పాలుపంచుకున్న అనిల్ రెడ్డి స్నేహితుడిని అడ్వైజర్ గా నియమించుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

This post was last modified on May 23, 2026 2:49 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

42 minutes ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

5 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

7 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

7 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

10 hours ago