“ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం” అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది కాక్‌రోచ్ జనతా పార్టీ . పేరు వింటేనే వినూత్నంగా ఉన్న ఈ “పార్టీ” ఇప్పటికీ అధికారిక రాజకీయ పార్టీ మాత్రం కాదు. ఎన్నికల కమిషన్ వద్ద నమోదు కాని ఈ సంస్థకు గుర్తు లేదు.. కార్యాలయం లేదు.. అధికారిక సభ్యత్వ వ్యవస్థ లేదు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా లేరు.
మహారాష్ట్రకు చెందిన రాజకీయ వ్యూహకర్త అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఈ వ్యంగ్య ఉద్యమం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. నిరుద్యోగం, సోషల్ మీడియా వ్యసనం, యువత జీవనశైలి, రాజకీయాలపై వ్యంగ్యంగా ఈ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. “పని లేకపోవడం, రోజంతా ఫోన్‌లో ఉండడం, రీల్స్ చూడడం” లాంటి అంశాలను సరదాగా పార్టీ అర్హతలుగా చెప్పడంతో యువతలో ఇది మీమ్ కల్చర్‌గా మారింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అధికారిక పార్టీ కాకపోయినా దీనికి మద్దతు ప్రకటిస్తున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. హర్యానాకు చెందిన అర్జున్ చౌతాలా తనను తాను “కాక్‌రోచ్ జనతా పార్టీ తొలి ఎమ్మెల్యే”గా ప్రకటించుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. యువతను ఉద్దేశించి వచ్చిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా ఇలా ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
అలాగే మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ సహా పలువురు నేతలు కూడా సోషల్ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు పెట్టారు. దీంతో ఇది కేవలం మీమ్ పేజీలకే పరిమితం కాకుండా రాజకీయ చర్చల్లో కూడా వినిపించడం ప్రారంభమైంది.
సోషల్ మీడియాలో అయితే “ఈ పార్టీ అభ్యర్థుల అర్హతలు” పేరుతో వస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగం లేకపోవాలి. రోజుకు 10 గంటలు ఫోన్‌లో ఉండాలి. రాత్రిళ్లు నిద్రపోకుండా రీల్స్ చూడాలి. ఇంట్లో వాళ్లతో తిట్లు తినాలి
అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు “దేశంలో నిరుద్యోగ యువతే ఈ పార్టీ అసలు బలం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు “ఇది రాజకీయ పార్టీ కాదు.. యువత అసంతృప్తికి ప్రతీక” అంటున్నారు.
అయితే వాస్తవానికి కాక్‌రోచ్ జనతా పార్టీకి అధికారిక నిర్మాణం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు. ప్రస్తుతం ఇది పూర్తిగా సోషల్ మీడియా వ్యంగ్య ఉద్యమంగానే కొనసాగుతోంది.
This post was last modified on May 23, 2026 2:52 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…