Political News

జమ్మలమడుగులో అభివృద్ధి పరుగులు

ఏపీలో అధికార కూటమి సర్కారు… రాష్ట్రాభివృద్ది దిశగా వేస్తున్న అడుగులు ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్త చర్చలకు తెర తీస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను అలా పక్కనబెడితే… కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమలో వరుసబెట్టి పరిశ్రమలు ఏర్పాటవుతున్న తీరు ఈ చర్చల విస్తరణను మరింతగా పెంచిందని చెప్పక తప్పదు. ఇలాంటి క్రమంలోనే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కడప జిల్లా జమ్మలమడుగులో ఓ భారీ సోలార్ ప్రాజెక్టుకు శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ యూనిట్ ను ప్రారంభించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఆ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి.

జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాల ఖిల్లా కిందే లెక్క. మునుపటి ఫ్యాక్షన్ తరహా నెత్తుటేరులు లేకున్నా… ఇప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని చెప్పక తప్పదు. అయితే కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత అన్ని ప్రాంతాలతో పాటుగా జమ్మలమడుగుపైనా దృష్టి సారించింది. ఒక్క జమ్మలమడుగే కాకుండా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్న కూటమి సర్కారు… ఆయా ప్రాంతాల్లో ఏఏ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్న కోణంలో ఆలోచించి మరీ ఆ మేరకే అడుగులు వేస్తోంది.

ఈ తరహా చర్యల్లో భాగంగా ఇటీవలే తిరుపతి జిల్లా సత్యవేడులో రాయల్ ఎన్ ఫీల్డ్ తన మోటార్ బైకుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీకి తమిళనాడు మినహా మరెక్కడా కూడా తయారీ ప్లాంట్ లేదు. తమిళనాడు వెలుపల తొలి తయారీ ప్లాంట్ కి ఆ కంపెనీ ఏపీనే ఎంచుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రక్షణ శాఖ ఫైటర్ జెట్ల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయదలిస్తే… ఆ యూనిట్ ను ఏపీకి ప్రత్యేకించి రాయలసీమకు తీసుకువచ్చే విషయంలో కూటమి సర్కారు సత్తా చాటింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇటీవలే ఈ యూనిట్ కు భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే.

ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే… సోలార్ విద్యుత్ తయారీలో అగ్రగామిగా ఎదుగుతున్న సీల్ కంపెనీని కూటమి సర్కారు ఏపీకి తీసుకువచ్చింది. గతేడాది ఈ కంపెనీ ఏపీలో తన ప్లాంట్ నునెలకొల్పేందుకు సిద్ధపడగా… ఆ కంపెనీకి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడంలో కూటమి సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఫలితంగా 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను సీల్ కంపెనీ కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసింది. వాస్తవానికి నీటి లభ్యత లేని జమ్మలమడుగు లాంటి ప్రాంతాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. అదే విషయాన్ని పసిగట్టిన కూటమి సర్కారు ఆ దిశగానే చర్యలు చేపట్టి జమ్మలమడుగుకు ఓ భారీ పరిశ్రమను తీసుకువచ్చిన వైనం నిజంగానే అభినందనీయమని చెప్పక తప్పదు.

This post was last modified on May 23, 2026 5:55 am

Share

Recent Posts

తండ్రిపై కొడుకు విజ‌యం

ఒక సూప‌ర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వ‌చ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంత‌గా వాడుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తాడు. న‌ట‌న‌లో తండ్రిని అనుక‌రించ‌డం.. త‌న…

3 hours ago

మోడీని బ్లాక్‌మెయిల్ చేయ‌లేను: కేంద్రంపై బాబు

కేంద్ర ప్ర‌భుత్వానికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న మాట వాస్త‌వ‌మేన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…

3 hours ago

జ‌గ‌న్ గురించి ఆ రాత్రి బాగా ఆలోచించా: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ‌లేద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే త‌ప్ప‌.. ఎప్పుడూ ఆయ‌న…

4 hours ago

ఫెయిర్‌నెస్ క్రీమ్ వల్ల కిడ్నీ దెబ్బతిందా?

అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…

4 hours ago

సీత చేసిన లోటు నిత్యారెడ్డితో ఔటు

రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…

5 hours ago

మైసా ఎంట్రీతో మరింత చిక్కుముడి

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…

5 hours ago