Political News

జ‌గ‌న్‌ను వారెందుకు క‌లిశారు: లోకేష్ ఆరా

మ‌నం ఎంతో పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. ఎవ‌రికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జ‌గ‌న్‌ను కొంద‌రు క‌లుస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది..? ఎవ‌రు త‌ప్పు చేశారు? ఎక్క‌డ జ‌రిగింది? అంటూ.. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. అస‌లు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకుని చెప్పాల‌ని కూడా ఆయన ఆదేశించారు. దీంతో అస‌లు విష‌యంపై పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్ర వ్యాప్తంగా 9 విశ్వ‌విద్యాల‌యాల్లోని 1543 పోస్టుల‌ను భ‌ర్తీచేసేందుకు ఆయా విశ్వ‌విద్యాల‌యాలు నోటిఫికేష‌న్లు జారీ చేశాయి. ఇవ‌న్నీ.. బోధ‌న‌కు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ప్రొఫెస‌ర్ పోస్టులే కావ‌డం గ‌మ‌నార్హం. వీటికి సంబంధించిన ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. అయితే.. ఈ పోస్టుల నియామ‌కంలో దివ్యాంగుల కోటాను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం.. వివాదానికి దారి తీసింది. స‌హ‌జంగానే ప్ర‌భుత్వ పోస్టుల విష‌యంలో దివ్యాంగుల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తారు. 2-3 శాతం వ‌ర‌కు వారికి రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తున్నారు.

కానీ, తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో దివ్యాంగుల రిజ‌ర్వేష‌న్‌ను ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల అసోసియేష‌న్ ప్ర‌తినిధులు తాజాగా వైసీపీ నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. తాము అన్యాయానికి గుర‌వుతున్నామ‌ని.. నిబంధ‌న‌ల మేర‌కు త‌మ‌కు రిజర్వేష‌న్ క‌ల్పించ‌కుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఆయ‌న ముందు చెప్పారు. అయితే.. వారికి జ‌గ‌న్ నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోయినా.. ఈ వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది. సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌ను కలిసిన దివ్యాంగుల ఫొటోలు పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి.

ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది? అనే విష‌యంపై ఆరా తీశారు. వాస్త‌వానికి రిజ‌ర్వేష‌న్ ఇవ్వాలా? వ‌ద్దా? అనే విష‌యంపై క్లారిటీ ఉందా? అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. రాజ‌కీయంగా దీనిని చూస్తే.. వ‌దిలేయాల‌ని.. లేక‌పోతే, నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వ‌క‌పోతే.. బాధ్యులు ఎవ‌రో త‌న‌కు చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై స‌మ‌గ్ర నివేదిక కోరినట్టు తెలిసింది. కాగా.. గ‌త ఏడాది కాలంలో జ‌గ‌న్‌ను ప‌లువురు క‌ల‌వ‌డం.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంపైనా లోకేష్ ఆరా తీశారు.

This post was last modified on May 21, 2026 10:47 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago