Movie News

బాలయ్యని మ్యాచ్ చేయడం ఈజీ కాదు

ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా నటించారనే కంపారిజన్లు విపరీతంగా వస్తాయి. తమిళ నాట్టమైలో విజయ్ కుమార్ పోషించిన ఫ్లాష్ బ్యాక్ పాత్రని కిలోమీటర్ల దూరంలో పెట్టేసే స్థాయిలో పెదరాయుడు రజనీకాంత్ విధ్వంసం సృష్టించడం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. దబాంగ్ లో సల్మాన్ ఖాన్ ఎనర్జీని మ్యాచ్ చేయడమే కాదు దాన్ని దాటినంత పని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో చేశారు.

ఇప్పుడీ టాపిక్ కి కారణం జన నాయకుడు. ఆరు నెలల తర్వాత మోక్షం దక్కించుకున్న ఈ మూవీలో విజయ్ క్యారెక్టర్ మీద అన్ని రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భగవంత్ కేసరిలో బాలయ్య ఏదైతే స్వాగ్ చూపించారో దాన్ని రీ క్రియేట్ చేయడంలో దర్శకుడు వినోత్ తడబడ్డారు అనేది వాస్తవం. ముఖ్యంగా సెకండాఫ్ లో చేసిన విపరీతమైన మార్పులు డ్యామేజ్ చేశాయనేది నిజం. ఒకవేళ మక్కికి మక్కి తీసి ఉంటే జనాల స్పందన ఇంకోలా ఉండేదేమో.

విజయ్ తెలుగు సినిమాలను రీమేక్ చేయడం కొత్త కాదు. పెళ్లి సందడి, పవిత్ర బంధం, బద్రి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నీతో, ఒక్కడు, అతనొక్కడే, పోకిరి లాంటి ఎన్నో టాలీవుడ్ రీమేకులు తన ఖాతాలో ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు తప్ప అన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు. అందుకే భగవంత్ కేసరి చూడగానే ఎక్కువ ఆలోచించకుండా అమ్మాయిల కోసం సందేశం ఉంది కాబట్టి ఇది తనకు బెస్ట్ ఛాయిసని భావించి ఉంటారు. అదే వినోత్ కు చెప్పి తీయించారు.

ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. కొన్ని క్యారెక్టర్లు బాలయ్యకు మాత్రమే సూటవుతాయి. అందుకే అనిల్ రావిపూడి రెగ్యులర్ హీరో తరహాలో డ్యూయెట్లు గట్రా పెట్టకుండా పెప్పర్ సాల్ట్ లుక్కుతో హీరోయిన్ ని మొక్కుబడిగా మార్చేసి శ్రీలీలని హైలైట్ చేయడం ద్వారా మంచి ఫలితం అందుకున్నారు. ఏకంగా సినిమాకు జాతీయ అవార్డుని తెచ్చి పెట్టారు. ఈ కోణంలో విజయ్ తీసుకున్నది మంచి నిర్ణయమే అయినా బాలయ్యని మ్యాచ్ చేయలేకపోవడం గురించి ఫ్యాన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

This post was last modified on July 23, 2026 7:10 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago