Movie News

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద ఫ్రాంచైజీ సక్సెస్ వచ్చినప్పుడు ఆ క్రేజ్ తగ్గకముందే సీక్వెల్‌ను త్వరగా థియేటర్లలోకి తేవాలని చూస్తారు. కానీ ‘యానిమల్ పార్క్’ విషయంలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. సినిమా వచ్చి ఇప్పటికే దాదాపు మూడేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా టైమ్ ఉంది. 

ఇది అనుకోకుండా పోస్ట్‌పోన్ అయిన సినిమా కాదు. సందీప్ రెడ్డి వంగా గతంలో చెప్పిన దాని ప్రకారం ‘యానిమల్ పార్క్’ షూటింగ్‌ను 2027 మధ్యలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ పోలీస్ డ్రామా ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాతే యానిమల్ పార్క్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నాడు. అటు హీరో రణ్‌బీర్ కపూర్ చూస్తే నితీష్ తివారీ ‘రామాయణ’, సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఆమధ్య జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్‌లో మాట్లాడిన రణ్‌బీర్, తన తర్వాతి ఫోకస్ మొత్తం రామాయణ, లవ్ అండ్ వార్ ప్రాజెక్టులపైనే ఉందని చెప్పాడు. ధూమ్ 4 రూమర్స్‌ను కొట్టిపారేసిన ఆయన యానిమల్ పార్క్ గురించి కొత్త అప్‌డేట్ ఏమీ ఇవ్వలేదు. దీంతో డైరెక్టర్, హీరో ఇద్దరి కమిట్‌మెంట్స్ వల్ల ఈ ఫ్రాంచైజీకి సహజంగానే పెద్ద గ్యాప్ వస్తోంది. యానిమల్ చివర్లో చూపించిన రణ్‌విజయ్ సింగ్ క్యారెక్టర్, అజీజ్ ఎంట్రీ సీన్లు సీక్వెల్‌పై అంచనాలు పెంచాయి. 

ఇంత పెద్ద హిట్ ఉన్నా వెంటనే పార్ట్ 2 మొదలుపెట్టకుండా ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఈ గ్యాప్ వల్ల సినిమాపై ఆడియన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. షూటింగ్ 2027 మధ్యలో మొదలయ్యే ప్లాన్ ఉండటంతో ఈ సీక్వెల్ థియేటర్లలోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. స్పిరిట్ పూర్తయి, రణ్‌బీర్ తన మిగతా కమిట్‌మెంట్స్ ముగించుకున్నాకే ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ రావచ్చు. 

This post was last modified on August 14, 2026 11:06 pm

Share

Recent Posts

అలక వీడిన కోమటిరెడ్డి?

సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న…

2 hours ago

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

4 hours ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

6 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

6 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

7 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

8 hours ago