మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం వృద్ధుల కోసం ఒక పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌కి దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే సొంత డబ్బులో 4 కోట్ల వరకు దీని కోసం ఖర్చు పెట్టానని తమన్ చెప్పాడు.
ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఫండ్స్ ఇస్తామని చాలామంది అడిగారట. పెద్ద కార్పొరేట్ కంపెనీలు సీఎస్సార్ ఫండ్స్ ఇస్తామని చెప్పినా తాను వద్దన్నానని తమన్ అన్నాడు. వాళ్ల దగ్గర డొనేషన్స్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడు. బయట వ్యక్తుల సాయం తీసుకోకుండా కేవలం తన సొంత డబ్బుతోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్లు వెల్లడించాడు.
అయితే ఇన్ని కోట్లు సొంతంగా ఎలా పెడుతున్నాడనే దానిపై కూడా ఆయన ఆన్సర్ ఇచ్చాడు. లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ నుంచి వచ్చే ఫండ్స్ దీనికే వాడుతున్నట్లు చెప్పాడు. అలాగే ఇండియన్ ఐడల్ లాంటి టీవీ షోలు చేసినప్పుడు వచ్చే రెమ్యునరేషన్, క్రికెట్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వచ్చే డబ్బులు మొత్తం ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్ కోసమే ఇస్తున్నానని తమన్ అన్నాడు. సినిమాల మీద వచ్చే ఆదాయం దీనికి కలపట్లేదని చెప్పాడు.
కేవలం ఆశ్రమం కట్టడం మాత్రమే కాకుండా ఇతర చారిటీ పనులు కూడా చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. తన టీమ్ ద్వారా ఎవరికైనా కాలేజ్ ఫీజులు కట్టడం, పిల్లలకు హార్ట్ ఆపరేషన్లకు ఫండ్స్ ఇవ్వడం, స్కూల్ బ్యాగులు పంచడం లాంటివి చూసుకుంటున్నానని అన్నాడు. ఈ ఖర్చులన్నీ కూడా బయట కాన్సర్ట్స్, టీవీ షోల ద్వారా తనకు వచ్చే ఆదాయం నుంచే వెళుతున్నాయని తమన్ మెన్షన్ చేశాడు. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఈ చారిటీకి వాడనని తమన్ చెప్పాడు. ఒక ప్రొడ్యూసర్ తనను నమ్మి సినిమా కోసం కోట్లు ఇచ్చినప్పుడు, ఆ డబ్బును మాక్సిమం ఆ మ్యూజిక్ క్వాలిటీ పెంచడానికే ఖర్చు పెడతానని అన్నాడు.
ఆ అవుట్ పుట్ బాగా రావడానికే ఆ డబ్బులన్నీ వాడతానని చెప్పాడు. అందుకే సినిమా బడ్జెట్ నుంచి తీసుకున్న డబ్బును తన సేవా కార్యక్రమాలకు ఎక్కడా వాడనని క్లియర్ గా చెప్పుకొచ్చాడు. సినిమా మ్యూజిక్ వర్క్ పూర్తయ్యాక అందులో ఏదైనా బ్యాలెన్స్ మిగిలితే, అది తన స్టూడియోకి వాడుకుంటానని తమన్ చెప్పాడు. కరెంటు బిల్లులు కట్టడం, స్టూడియోకి కావాల్సిన కొత్త ఎక్విప్‌మెంట్స్ కొనుక్కోవడం, తన బేసిక్ లైఫ్‌స్టైల్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఆ డబ్బు తీసుకుంటానని అన్నాడు.
This post was last modified on August 14, 2026 11:15 pm
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…
తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2…
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…