Movie News

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడం బయ్యర్ వర్గాలను ఆనందంతో ముంచెత్తింది. బిజినెస్ రీజనబుల్ గా చేయడంతో రికవరీ త్వరగా సాధ్యమయ్యింది. అయితే రెండో వారం కన్నా ముందే ఆక్యుపెన్సీలు తగ్గిపోవడం, లోకేష్ కనగరాజ్ డిసి ప్రభావం ఏపీ తెలంగాణలో బలంగా ఉండటం లాంటి కారణాలు మెగా ప్రిన్స్ ని కొంత వెనుకబడేలా చేశాయి. టీమ్ ఆ వెంటనే మేల్కొంది.

చిరంజీవిని గెస్టుగా తీసుకొచ్చి సక్సెస్ మీట్ ఘనంగా చేయడం వాటిలో ఒకటి కాగా తాజాగా మరోసారి విజయోత్సవ వేడుకలను నిర్వహించడం ఇంకో విశేషం. ఈసారి జనసేన నేతలు, మంత్రులు అతిథులుగా వచ్చారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ సెన్సార్ చిక్కుల్లో పడ్డప్పుడు ఒక్క ఫోన్ కాల్ తో సమస్యని పరిష్కరించానని చెప్పడం ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కొరియన్ కనకరాజుకి ఇది చివరి ఓవర్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం.

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ కు తమిళనాడు కన్నా మన దగ్గరే మంచి టాక్ నడుస్తోంది. డిసి రెండో వారంలోనూ బలంగా ఉంది. మల్టీప్లెక్సుల్లో ఉహించని విధంగా ఆవారాపన్ 2 డామినేషన్ షో కౌంట్ మీద ప్రభావం చూపిస్తోంది. చాలా చోట్ల స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేని ఒకటో రెండో షోలతో కొనసాగిస్తున్నారు. ఇవి కాకుండా కొత్త రిలీజులు మరో నాలుగైదు ఉన్నాయి. అవన్నీ టాక్ కోసం ఎదురు చూసి పికప్ అవుతాయనే నమ్మకంతో వెయిట్ చేస్తున్నాయి.

ఆగస్ట్ 21 ఇరుముడి, ఆపై వారం టాక్సిక్ వచ్చేస్తాయి. అంటే కొరియన్ కనకరాజు చేతిలో ఉన్నది ఒక్క వారమే. ఇప్పుడు శని ఆదివారాలు కనక తిరిగి ఊపందుకుంటే లాభాల శాతం మరింత పెరుగుతుంది. కామెడీ సంగతి పక్కనపెడితే యునానిమస్ గా ఒకే టాక్ రాకపోవడం వీకెండ్ తర్వాత కనకరాజు మీద ప్రభావం చూపించింది. పైగా మాస్ జనాలు, యూత్ డిసి వైపు ఎక్కువ షిఫ్ట్ కావడం కలెక్షన్లను ఎఫెక్ట్ చేసింది. చూడాలి మరి ఫైనల్ క్లోజింగ్ నెంబర్స్ ఏమేం నమోదు చేస్తాడో.  

This post was last modified on August 14, 2026 11:00 pm

Share

Recent Posts

ప్రియదర్శికి కలిగిన ప్రయోజనం ఎక్కువే

టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…

5 hours ago

నాయకులు చెబుతున్నా నేతలు కదలడం లేదు

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియ‌స్‌గా ఉన్న…

5 hours ago

జైలర్ 2 కోసం రెండో నెంబర్ అలెర్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో…

5 hours ago

ధనుష్ నుంచి ఇది నేర్చుకోవచ్చు

స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…

6 hours ago

మోడీ ఇలాకాలో లోకేష్ దూకుడు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబ‌డి దారుల‌ను క‌లిసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌.. ఏపీలో…

7 hours ago

సీఈసీ వివాదం… ఇది ఎవరి సమస్య?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఆ ప‌ద‌వికి ఆయ‌న అన‌ర్హుడ‌ని.. పేర్కొంటూ..…

9 hours ago