సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్సర్లు, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని, కోర్టులను ప్రశ్నించేవారిపై నిప్పులు చెరిగారు. మీరంతా బొద్దింకలు.. పరాన్న జీవులుఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనీ పాటా లేనివాళ్లు.. ఇన్ ఫ్య్లయెన్సర్లుగా అవతరిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. సమచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలపై బొద్దింకల్లా ఎగబడి దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కానీ.. ఇవి ఉన్నవి ప్రజల కోసం కాబట్టి.. సంయమనం పాటిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
కొందరు న్యాయవాదులకు.. వారి సీనియారిటీని అనుసరించి.. హైకోర్టులు.. సీనియర్ అడ్వొకేట్ హోదా ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఇది కోర్టుల విచక్షణకే వదిలివేసింది. ఈ క్రమంలో సంజయ్ దుబే అనే న్యాయవాది.. తనకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిని విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆమూలాగ్రం పరిశీలించింది.
ఈ సమయంలో తనకు సదరు హోదా దక్కకపోవడంపై.. సంజయ్ దూబే చేసిన సోషల్ మీడియా వీడియోలను కూడా సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వీడియోల్లో న్యాయవ్యవస్థను కించపరిచేలా సంజయ్ దూబే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైనే సీజేఐ సీరియస్ అయ్యారు.
సోషల్ మీడియా పేరుతో న్యాయవ్యవస్థకే కాకుండా.. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను కూడా బొద్దింకల మాదిరిగా పీడిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. సోషల్ మీడియా లేకపోతే.. సమాచార హక్కు చట్టం కింద కొందరు న్యాయవాదులు వ్యవస్థలను శాసించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.
అదేసమయంలో రేపు ఢిల్లీ కోర్టు మీకు..సీనియర్ అడ్వొకేట్‌గా హోదా ఇచ్చినా.. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సదరు హోదాను వెనక్కి తీసుకుంటామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో మరో బాంబు కూడా పేల్చారు. కొందరు న్యాయవాదులకు పట్టాలు ఎలా వచ్చాయో కూడా అర్థం కావడం లేదని.. ఏదో జరిగిందన్న అనుమానం ఉందన్నారు. ఎవరైనా దీనిపై పిటిషన్ వేస్తే.. న్యాయవాదుల పట్టాలపై నిశిత విచారణ కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ దెబ్బతో సంజయ్ దూబే తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
This post was last modified on May 15, 2026 9:56 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…