Political News

జాతీయ రాజకీయాలపై రేవంత్ కన్ను

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ ను గద్దె దించి… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆయన అధికార పార్టీగా మలచారు. సీఎంగా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో రాజకీయంగా రేవంత్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. 2034 వరకూ తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని ఆయన శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం ఓ న్యూస్ యాప్ ఏర్పాటు చేసిన న్యూస్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఉచ్ఛ స్థితిలో ఉన్న రేవంత్… ఇదే స్థితిలో మరో ఏడెనిమిది ఏళ్ల పాటు కొనసాగుతానన్న ధీమాను వ్యక్తం చేశారు. 2034 వరకు తాను రాష్ట్ర రాజకీయీల్లోనే కొనసాగుతానని చెప్పిన రేవంత్… అప్పటిదాకా రాష్ట్రానికి సీఎంగా తానే కొనసాగుతానని చెప్పారు. 2034 తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ఆయన చెప్పారు.

వాస్తవానికి ఈ మాటను గతంలోనూ పలుమార్లు రేవంత్ చెప్పారు. అయితే ఈ దఫా ఆయన నోట స్పష్టమైన ధీమా వ్యక్తం అయ్యిందని చెప్పాలి. 2034 వరకు తెలంగాణ సీఎంగా తానే ఉంటానని చెప్పిన రేవంత్… కావాలంటే రాసి పెట్టుకోండని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఓ జడ్పీటీసీగా ఉన్న తనను సీఎంవి అవుతావా? అంటూ కొందరు ప్రశ్నించారని ఆయన తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నాడు వారి ప్రశ్నలకు తన మౌనమే సమాధానం చెప్పిందన్న రేవంత్… జడ్పీటీసీ నుంచి సీఎం అయి చూపించానని వ్యాఖ్యానించారు. 2034 తర్వాత తన తర్వాతి తరానికి సీఎం పదవిని అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

This post was last modified on May 15, 2026 9:58 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago