Political News

ఇంత నొప్పి ఎలా తట్టుకుంటున్నావ్ పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి మాత్రమే తీసుకుని తిరిగి పనిలో పడిపోయారు. ఈ సందర్భంగా తనను వేధిస్తున్న అనారోగ్య సమస్యలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కు ఏమైంది అన్న విషయంపై పలువురు పలు రకాలుగా విశ్లేషించుకుంటున్న నేపథ్యంలో తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పవనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు.

తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను పవన్ వివరించారు. తాను చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు పవన్ చెప్పారు. పవన్ నోట నుంచి వినిపించిన ఈ మాటలను విన్నవారంతా ఇన్నాళ్లు ఆ నొప్పిని ఎలా భరించారండి అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న పవన్ గురువారం హైదరాబాద్ నుంచి మంగళగిరి చేరిన సంగతి తెలిసిందే. గురువారం నాటి కేబినెట్ భేటీలో ఆయన పాలుపంచుకున్నారు. అనంతరం శుక్రవారం జనసేన శ్రేణులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. జనసేన సభ్యత్వ నమోదులో మెరుగ్గా రాణించిన జనసేన సాధక్ లతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశంలో ఉత్సాహంగా కనిపించిన పవన్… తన అనారోగ్య సమస్యలపై స్పందించారు.

తనకు ఏమైందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారన్న పవన్… తాను చాలా సమస్యలతో సతమతం అవుతున్నానని చెప్పుకొచ్చారు. తన అభిమానుల కోలాహలంతోనూ తాను ఇబ్బందులు పడ్డానని కూడా ఆయన అన్నారు.

జనాల్లోకి వెళ్లినప్పుడు ఓ అభిమాని ఓ చేయిని పట్టుకుని ఇటువైపు గుంజితే..మరో అభిమాని మరో వైపునకు గుంజుతారని ఆయన అన్నారు. ఈ కారణంగా చేయి నొప్పితో బాధపడుతున్నానని తెలిపారు. రెండు భుజాల మధ్య గ్యాప్ కూడా వచ్చిందన్నారు. అభిమానుల వల్లే కలిగిన ఈ నొప్పిని అభిమానుల ఆప్యాయతలతోనే మరిచిపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక కరోనా సమయంలో తాను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డానన్న పవన్.. అది ఇప్పటికీ పూర్తిగా పోలేదన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక జనంలోకి వెళ్తక తప్పని పరిస్థితిని ప్రస్తావించిన పవన్… ఈ సందర్భంగా దుమ్ము దూళి వల్ల సైనస్ సమస్య తలెత్తిందని తెలిపారు. ఈ సమస్య మరింతగా పెరగగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. దీర్ఘ కాలిక వెన్ను సమస్య కూడా అలానే ఉందని చెప్పడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు.

ఇన్ని సమస్యలు ఉన్నా… స్పోర్స్ట్ పర్సనాలిటీ కారణంగా ఆ నొప్పులను తాను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మాత్రం ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటున్నారన్న ప్రశ్న ఎదురవుతోందన్నారు. తన అబిమానుల అభిమానంతోనే ఈ నొప్పులను అలా భరిస్తూ వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.

This post was last modified on May 16, 2026 6:30 am

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

53 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

57 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

4 hours ago