Political News

తెలంగాణ కోసం పని చేస్తున్నారా? ఐతే ఈ అవార్డు మీదే!

తెలంగాణ ప్ర‌జ‌ల కోసం.. తెలంగాణ స‌మాజం కోసం అనేక మంది క‌ష్ట‌ప‌డ్డారు. క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే.. వారికి స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డం.. స‌మాజంలోనూ వారికి ప్రాధాన్యం ద‌క్క‌డం గ‌గ‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం.. `గ‌వ‌ర్న‌ర్ ఎక్స‌లెన్స్‌` పేరుతో రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి సేవ చేసిన వారికి.. సామాజిక ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డిన వారికి గుర్తింపు ఇవ్వ‌డంతోపాటు.. వారికి అవార్డుల‌ను కూడా బ‌హూక‌రిస్తోంది. తొలిసారి కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఈ అవార్డుల‌ను ఇస్తున్నారు. ఇలా.. ఇప్ప‌టికి రెండు సార్లు అవార్డులను ప్ర‌క‌టించ‌గా.. తాజాగా మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

తెలంగాణ‌లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌, మొక్క‌ల పెంప‌కం, అభివృద్ధి నుంచి విద్య, సామాజిక చైత‌న్యం వంటి అనేక అంశాల్లో కృషి చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యున్న‌తిలో నిలిపేందుకు క‌ష్టించిన వారిని ఈ అవార్డుల‌తో స‌త్క‌రించ‌నున్నారు. అవార్డు గ్రహీత‌ల‌కు మొమెంటోతోపాటు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు న‌గ‌దు బ‌హుమ‌తి, ప్ర‌శంసా ప‌త్రం అందిస్తారు. తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ చేతుల‌మీదుగా ఈ అవార్డులు, రివార్డుల‌ను అందించ‌నున్నారు. ఈ అవార్డుల కోసం.. వ్య‌క్తులు, సంస్థ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే.. వారు చేసిన ప‌నులు, అవి తెలంగాణ స‌మాజానికి ఏవిధంగా దోహ‌ద‌ప‌డ్డాయ‌న్న విష‌యాల‌ను వివ‌రించాలి.

ఇవీ.. ప్ర‌ధాన అంశాలు..

1)  డ్ర‌గ్స్ నిర్మూల‌న‌:  తెలంగాణ స‌మాజంలో ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయిన డ్ర‌గ్స్ ప్ర‌భావం నుంచి యువ‌త‌ను సంర‌క్షించేందుకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. యువ‌త‌లో చైత‌న్యం తెచ్చిన వారికి అవార్డులు ఇవ్వ‌నున్నారు.
2)  ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం:  తెలంగాణ‌లోని హిజ్రాల కోసం ఉద్యోగ‌, ఉపాధి రంగాల‌ను సృష్టించిన వారికి, వారి కుటుంబాలు, పిల్ల‌ల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేసిన‌వారికి అవార్డులు ఇస్తారు.
3) విద్య:  అణ‌గారిని వ‌ర్గాలు, ముఖ్యంగా గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల్లోని చిన్నారుల‌కు విద్య‌ను అందించేవారిని గుర్తించి అవార్డులు ఇస్తారు.
4) ఉపాధి, పర్యావరణం, భూమి, నీటి సంరక్షణ, భూగర్భ జలాలు, చెరువుల పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి కీల‌క అంశాల్లో విశేష కృషి చేసి.. తెలంగాణ స‌మాజానికి మేలు చేసిన వారిని గుర్తిస్తారు.
5) ఆన్‌లైన్‌లోనే గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి ద‌ర‌ఖాస్తులు పంపించాలి. వ‌చ్చే నెల 20 వ‌ర‌కు అవ‌కాశం ఉంటుంది.
6) స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్ ఆధ్వ‌ర్యంలో నియ‌మించిన క‌మిటీ అవార్డు గ్ర‌హీత‌ల‌ను ఎంపిక చేస్తుంది. వీటిని ప‌త్రిక‌లు, మీడియా ద్వారా తెలియ‌జేస్తుంది. 

This post was last modified on November 17, 2026 9:03 pm

Share

Recent Posts

ఐపీఎల్‌తో ధోని మొత్తం ఆదాయం ఎంత?

ఐపీఎల్‌లో ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సంపాదన రూ.200 కోట్ల మార్కును దాటింది. 2008లో రూ.6 కోట్లతో మొదలైన అతడి…

50 minutes ago

మ‌హావ‌తార న‌ర‌సింహ.. తెలుగు రైట‌ర్ ఆవేద‌న‌

మ‌హావ‌తార న‌ర‌సింహ‌.. గ‌త ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేష‌న్ మూవీ రిలీజ‌య్యే…

3 hours ago

ఛలో దర్శకుడిని తిట్టారా పొగిడారా

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…

3 hours ago

లిఫ్ట్ అడిగేటప్పుడు జాగ్రత్త మహిళలు

మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…

4 hours ago

అక్రమ సంబంధాల వివాదం… మళ్ళీ సీఈవోగా వస్తానంటున్న జెన్సెన్

ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర…

4 hours ago

పాపం… ట్రైన్ ఎక్కిద్దాం అని వెళ్ళి ఫైన్ కట్టి వచ్చారు

బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి…

4 hours ago