ఒక గ్రామానికి సర్పంచ్. నిజానికి పెద్దగా జీతం ఉండదు. ప్రభుత్వం నుంచి పెద్దగా ఆదరవు కూడా దక్కదు. కేవలం 3 వేల రూపాయల వేతనం ఇస్తారు. అయితే.. అంతకుమించిన బాధ్యతలు కూడా మోపుతారు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో నెలకు 3 వేల రూపాయల జీతానికి ఏం వస్తుంది? అంటే.. చెప్పడం కష్టమే. మరి అలాంటి పదవి కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కోట్ల రూపాయలు వెచ్చించి.. వాటిని ఏకగ్రీవాలు చేసుకోవడం ఏంటి? ఎందుకు? అసలు సర్పంచ్ పదవులను ఇంత పెట్టి కొనుగోలు చేయడం అవసరమా? అనేది కీలక ప్రశ్న.
రీజనేంటి..?
సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకోవడం వరకు తప్పులేదు. గ్రామాల్లో ప్రజలు ఒక నాయకుడిని ఎంచుకోవడం ద్వారా పోటీ లేకుండానే ఈ పదవిని భర్తీ చేసుకోవచ్చు. కానీ, అసలు కొనుగోలుచేయడం ఏంటి? పైగా కోట్లు, లక్షల రూపాయలకు ఈ పదవులను దక్కించుకునే ప్రయత్నం ఏంటి? అనే సందేహాలు వ్యక్తమవుతాయి. దీనికి ప్రధాన కారణం.. గ్రామంలో ఆధిపత్యం కోసం.. లేదా పేరు, ప్రతిష్ఠల కోసమే. సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుంది. ఈ పవర్ నిజానికి ముఖ్యమంత్రికి కూడా ఉండదు. సీఎంకు డబ్బులు అవసరమైనా.. ఆర్థిక శాఖ కార్యదర్శికి చెప్పి తీసుకో వాలి. కానీ, సర్పంచ్ అలా కాదు.. నేరుగా గ్రామ నిధులను ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
మరికొన్ని రీజన్లు..
1) ఎన్నికల ఖర్చులను నివారించడం: సాధారణ ఎన్నికల్లో పోటీ పడి లక్షల రూపాయలు వృథాగా ఖర్చు చేయడానికి బదులు, ఆ మొత్తాన్ని గ్రామానికి అందించడం మేలని స్థానిక నేతలు భావిస్తున్నారు. అందుకే.. పోటా పోటీ అయినా సరే.. వేలం ద్వారా పదవులు దక్కించుకుంటున్నారు.
2) గ్రామాభివృద్ధి: వేలం పాటలో వచ్చే డబ్బును గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి, పాఠశాలలకు లేదా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఏకగ్రీవ ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నారు.
3) పలుకుబడి: తమ పలుకుబడిని నిలబెట్టుకోవడానికి, రాజకీయ హోదా కోసం కొందరు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు కోట్ల రూపాయలు లేదా భూములను ఆఫర్ చేస్తూ ఈ వేలంలో పోటీ పడుతున్నారు. తద్వారా పదవులను దక్కించుకుంటున్నారు.
4) గొడవలు లేని వాతావరణం: ఎన్నికల సమయంలో గ్రామాల్లో పార్టీల మధ్య తలెత్తే ఘర్షణలు, విభేదాలను నివారించడానికి ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకునే పేరుతో ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. తద్వారా.. ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. అభివృద్ధి కేంద్రంగా గ్రామం డెవలప్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో పంచాయతీ సర్పంచ్ పోస్టులకు భారీ డిమాండ్ పెరిగిపోవడం గమనార్హం.
This post was last modified on November 17, 2026 8:19 pm
తెలంగాణ ప్రజల కోసం.. తెలంగాణ సమాజం కోసం అనేక మంది కష్టపడ్డారు. కష్టపడుతున్నారు. అయితే.. వారికి సరైన గుర్తింపు లేకపోవడం..…
ఐపీఎల్లో ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సంపాదన రూ.200 కోట్ల మార్కును దాటింది. 2008లో రూ.6 కోట్లతో మొదలైన అతడి…
మహావతార నరసింహ.. గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేషన్ మూవీ రిలీజయ్యే…
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…
మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…
ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర…