Political News

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా దూసుకెళ్తుండడం. విజయ్ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ కాగలడన్న అంచనా ముందు నుంచి ఉంది. కానీ అతను ఏకంగా ‘కింగ్’గా అవతరిస్తాడని ఊహించన వాళ్లు మాత్రం తక్కువ.

ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సీఎం అయి చరిత్ర సృష్టించబోతున్నాడు విజయ్. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఏపీలో సైతం చర్చనీయాంశంగా మారాయి. విజయ్ విజయం పట్ల అన్ని పార్టీల వాళ్లూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఐతే వైసీపీ వాళ్లు మాత్రం ఇది తమ విజయం అన్నట్లుగా సెలబ్రేట్ చేస్తుండడం..

జనసేనాని పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేయడానికి ఈ ఫలితాలను వాడుకుంటుండడం గమనార్హం. పవన్ లాగా విజయ్ పొత్తులతో బరిలోకి దిగలేదని.. తొలి ఎన్నికల్లో పవన్‌లాగా రెండు చోట్లా ఓడిపోలేదని.. ఇలా రకరకాల కామెంట్లతో వాళ్లు రెచ్చిపోతున్నారు.

ఐతే విజయ్‌తో పోలిక పెట్టి పవన్‌ను కించపరచడం వైసీపీ వాళ్లకు తాత్కాలిక ఆనందాన్నిస్తుంది కానీ.. అంతకుమించి విజయ్ సాధించిన ఫలితాలు వారికి ఏ రకంగా ప్రయోజనం అన్నదే ఇక్కడ ప్రశ్న. ఒక పెళ్లిలో అనుకోకుండా విజయ్‌ని కలిసినందుకే ఆ మధ్య తెగ ఎలివేషన్లు వేసుకున్నారు వైసీపీ వాళ్లు. అదే వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వచ్చారు. ఆయనతోనూ జగన్ ఫొటో దిగారు.

మరి అప్పుడు కలిసిన ఇద్దరిలో ఎవరి ఫలితాన్ని జగన్ అభిమానులు ఓన్ చేసుకోవాలన్నది ప్రశ్న. ఇంకోవైపు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజా.. డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేసి వచ్చింది. ఆమెతో ప్రచారం చేయించుకున్న వాళ్లు ఓడిపోతున్నారు.

ఒకవేళ జగన్.. విజయ్‌కి మద్దతుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే, ఇంకే రకంగా అయినా సపోర్ట్ చేసి ఉంటే.. ఆయన విజయాన్ని ఓన్ చేసుకుని తమ మద్దతుతో విజయ్ గెలిచాడని చెప్పుకోవడానికి అవకాశముండేది. కేవలం పవన్‌తో పోలిక పెట్టి తాత్కాలికంగా ఆనందించడానికి తప్ప విజయ్ సాధించిన ఫలితం వైసీపీ వాళ్లకు ఏ రకంగానూ ఉపయోగపడేది కాదు.

ఈ ఫలితం వైసీపీ రాతను ఏ రకంగానూ మార్చదు. పవన్ ప్రభుత్వంలో భాగస్వామి, డిప్యూటీ సీఎం.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంది అన్నది వాస్తవం. అయినా విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు అంటే.. అక్కడి పరిస్థితులు వేరు. పవన్ పొత్తులతో బరిలోకి దిగాడు అంటే ఇక్కడి పరిస్థితులు వేరు. అయినా ఎలా పోటీ చేశారన్నది ముఖ్యం కాదు. అధికారం చేపట్టారా లేదా అన్నదే ప్రధానం.

అసలు విజయ్ ఒంటరి పోటీ గురించి తెగ ఎలివేషన్లు వేసుకుంటున్న వైసీపీ వాళ్లు, జగన్ ఒంటరిగా పోటీ చేసి 11 సీట్లే సాధించిన సంగతి మరువరాదు. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత రెండేళ్లు గడవగా.. వైసీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచే సంకేతాలు కూడా కనిపించడం లేదు. తమ పార్టీ పరిస్థితేంటో చూసుకోకుండా.. తమకు ఎంతమాత్రం సంబంధం లేని, ఏ రకంగా ప్రయోజనం చేకూర్చని టీవీకే విజయం గురించి ఇంతగా ఎగిరిపడడం దేనికో?

This post was last modified on May 4, 2026 2:47 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago