ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల విషయంలో చిన్న చిన్న విషయాలను పట్టుకుని సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకోవడం మన వాళ్లకు అలవాటే. అసలు గొడవల కోసమే ఏదో ఒక టాపిక్‌ను చర్చనీయాంశంగా మారుస్తారా అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి.
ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తన తొలి ఎన్నికల్లో సాధించబోయే ఫలితాల మీద మన వాళ్లు రెండు రోజులుగా తీవ్రంగా ఘర్షణలు పడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అద్భుత ఫలితాలు రాబట్టి ఏకంగా సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్‌లో ఒక సంస్థ అంచనా వేసింది. మరి కొన్ని సంస్థలు అతను కింగ్ కాకపోయినా, కింగ్ మేకర్ అవుతాడంటూ అంచనా వేశాయి. మరి కొన్ని సంస్థలు అతను ఒక మోస్తరు ప్రభావమే చూపిస్తాడని, డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడతాడని పేర్కొన్నాయి.
ఐతే ఈ అంచనాల మీద మన వాళ్లు చర్చలతో సరిపెట్టకుండా పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో గొడవలు పడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్లు జనసైనికులను రెచ్చగొట్టడానికి విజయ్ మీద వస్తున్న అంచనాలను ఉపయోగించుకుంటున్నారు. తమిళనాడు ఎన్నికల ముందు ఒక సందర్భంలో జగన్, విజయ్ కలిసి కనిపించడం.. అతను జగన్ లాగే క్రిస్టియన్ కావడం.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ తమిళ హీరోను వైసీపీ వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు.
అతను తమిళనాట పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడాన్ని గుర్తు చేస్తూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ముందు నుంచి ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూపించి, తొలి ఎన్నికలోనే పవన్ కంటే అద్భుత ఫలితాలు రాబట్టబోతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు చిరంజీవికి కూడా పోలిక తెచ్చి మెగాస్టార్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ వాళ్ల ట్రాప్‌లో పడి జనసైనికులు వారితో గొడవలు పెట్టేసుకుంటున్నారు. మధ్యలో టీడీపీ వాళ్లు కూడా ఈ రచ్చలో భాగం అవుతున్నారు. నిజానికి ఏపీలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం చాలా పెద్ద విషయం. దీని మీద కూటమి మద్దతుదారులు బాగా ప్రమోట్ చేసుకుని హైలైట్ చేసుకోవాల్సిన అవసరముంది.
కానీ ఇలా ఏపీలో ఏ పెద్ద విషయం జరిగినా.. వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో డీవియేషన్ కోసం ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి టీడీపీ, జనసేన వాళ్లను ట్రాప్‌లో పడేస్తుంటారు. విజయ్ వ్యవహారం కూడా అలాగే ఉంది. అయినా ఫలితాలు వచ్చాక గొడవలు పడినా ఒక అర్థం ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మీద ఇంత రచ్చ చేయడం మరీ విడ్డూరం.
This post was last modified on May 1, 2026 9:26 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…