టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అద్భుత ఫలితాలు రాబడుతూ సత్తా చాటుతున్నారు. పార్టీ నిర్వహణలో ఇప్పటికే ఓ బెంచ్ మార్క్ విజయాన్ని నమోదు చేసుకున్న లోకేశ్… ఇప్పుడు మంత్రి హోదాలోనూ రికార్డు విక్టరీని నమోదు చేశారు. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో లోకేశ్ కార్యాచరణ అద్భుతాన్ని సృష్టించిందని చెప్పాలి. పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా లోకేశ్ అమలు చేసిన యాక్షన్ ప్లాన్ రికార్డు ఫలితాలన అందించింది.
2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఐటీ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి శాఖలనూ పర్యవేక్షిస్తున్నప్పటికీ విద్యా శాఖపై లోకేశ్ ప్రధాన దృష్టి సారించారు. అందులో భాగంగా పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే దిశగా ఆయన వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేశారు.
ఈ ప్లాన్ కింద విద్యార్థులు…ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల…అందులోనూ బాలికల విద్యపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులు, ఆయా పాఠశాలలపై విద్యా శాఖ ఉన్నతాధికారులు ఐక్యంగా పనిచేసేలా కార్యాచరణను రూపొందించారు. పిల్లలకు ఉత్తమ విద్యా బోధనతో పాటుగా ఆయా పాఠ్యాంశాలపై విద్యార్థులకు మరింత లోతుగా అవగాహన పెరిగేలా చేశారు. ఇక విద్య నుంచి పిల్లల దృష్టి మరలకుండా ఈ టీం ప్రత్యేకంగా పనిచేసింది.
గురువారం ఏపీలో పదో తరగతి ఫలితాలు వెల్లడి కాగా… గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం భారీగా పెరిగింది. గతేడాది 81.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా… ఈ ఏడాది ఆ శాతం ఏకంగా 85.25కు పెరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 శాతం నుంచి ఏకంగా 78.39 శాతానికి పెరిగింది.
ఇక ఓవరాల్ ఉత్తీర్ణత శాతానికి వస్తే… బాలుర కంటే బాలికలు 5.22 శాతం మేర అధిక ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను చూస్తే… లొోకేశ్ అమలు చేసిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఓ రేంజిలో పనిచేసిందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates