Political News

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న డిపో ఎదుటే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 32 డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

ఇక ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, కార్మికులు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నిరసనలు కొనసాగించాలని, ఆవేశపూరిత చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పలు డిపోల వద్ద నిరసనలు చేపట్టి, శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం చర్చల దిశగా అడుగులు వేస్తోంది.

This post was last modified on April 24, 2026 11:45 am

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

1 minute ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

6 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

59 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago