తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్ అవుతున్నాయి. రిజల్ట్స్ పట్ల టెన్షన్ అయితే సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అభిమానుల దృష్టి జన నాయకుడు మీదకు వెళ్తోంది. పోలింగ్ ఫినిషయ్యింది కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా నిర్మాత చేతికి అందలేదు. ఇవాళో రేపో ఆ లాంఛనం అయిపోతుందని అనుకుంటున్నారు.
కెవిఎన్ టీమ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది ఈ వారంలోనే జన నాయకుడు రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ బాగా వస్తాయి, వసూళ్ల పరంగా టెన్షన్ ఉండదు. కాకపోతే పైరసీ దెబ్బ గట్టిగానే తగిలింది కాబట్టి దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో జనాలు చూసేశారు కనక వాళ్లంతా మళ్ళీ టికెట్లు కొంటారానే దాని మీద అనుమానాలు నెలకొన్నాయి. సో రిస్క్ చేసి బరిలో దిగడం ముందు చేయాల్సిన పని.
రెండోది ఫలితాలు వచ్చాక విడుదల చేయడం. ఒకవేళ విజయ్ కనక విజేతగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో లేకా హంగ్ లో కీలక పాత్ర పోషించడమో చేయాల్సి వస్తే అప్పుడు జన నాయకుడుకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా కోరుకున్న స్థాయిలో, కావాల్సినన్ని థియేటర్లలో రిలీజ్ చేసుకోవచ్చు. లేదూ డిఎంకెనే గెలిస్తే విజయ్ ఓటమి ఎఫెక్ట్ జన నాయకుడు థియేటర్ రన్ మీద పడుతుంది. ఇది కొంచెం ఇబ్బందే.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందైతే సెన్సార్ ఫార్మాలిటీ అయిపోవాలి. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడు మన భగవంత్ కేసరి రీమేకన్న సంగతి తెలిసిందే. జనవరిలో పివిఆర్ ఐనాక్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ కు ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు అదే డీల్ కొనసాగిస్తారా లేక వేరే నిర్మాత రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. దీని సంగతేమో కానీ విజయ్ పాత సినిమా శివకాశి ఇవాళ రీ రిలీజై తమిళనాట బాగానే సందడి చేస్తోంది.
This post was last modified on April 24, 2026 11:51 am
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…