లాక్ డౌన్ వేళ.. కండోమ్ అమ్మకాల్లో రికార్డులు బ్రేక్..

కరోనా కారణంగా వచ్చి పడిన సమస్యలు అన్నిఇన్ని కావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. లాక్ డౌన్ కారణంగా జీవనశైలిలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని కరోనా సడన్ బ్రేక్ వేసింది. దీంతో ఎక్కడవారు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. సుదీర్ఘంగా సాగిన లాక్ డౌన్.. ఇప్పటికి కొనసాగుతున్న వర్కు ఫ్రం హోం. వైరస్ భయంలో వీలైనంతవరకు ఇంటికే పరిమితమవుతున్న వైనంతో దంపతుల మధ్య సెక్స్ లైఫ్ కొత్త పుంతలు తొక్కుతుందని చెబుతున్నారు.

లాక్ డౌన్ లో సెక్సు లైఫ్ ని విపరీతంగా ఎంజాయ్ చేశారన్న విషయాన్ని పెరిగిన కండోమ్ అమ్మకాలు.. గర్భ నిరోధక మాత్రలే చెబుతున్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. లాక్ డౌన్ వేళ గతంతో పోలిస్తే.. సెక్సు లైఫ్ ఎంజాయ్ చేసిన వారే ఎక్కువ.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కండోమ్ అమ్మకాలకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కండోమ్ అమ్మకాలు రాత్రి పూట కంటే కూడా పగటి పూటే ఎక్కువగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఆన్ లైన్ లో ఆర్డర్లు చూసినప్పుడు ఉదయం వేళలో ఆర్డర్ చేసే వారు అంతకంతకూ పెరుగుతున్న విసయాన్ని డుంజో యాప్ వెల్లడించింది. దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన కండోమ్ అమ్మకాలు చూస్తే.. హైదరాబాద్ లో గతంతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువైనట్లుగా తేలింది.

అదే సమయంలో చెన్నైలో ఐదు రెట్లు ఎక్కువగా పెరిగితే.. జైపూర్ లో నాలుగు రెట్లు.. బెంగళూరు.. ముంబయిలలో మూడు రెట్లు ఎక్కువగా కండోమ్ వినియోగం పెరిగినట్లుగా తేలింది. అంతేకాదు..పెరిగిన కండోమ్ అమ్మకాల్ని చూసినప్పుడు సురక్షిత సెక్సు విషయంలో జాగ్రత్త పెరిగిందన్న విషయం కూడా స్పష్టమవుతున్నట్లుగా తెలుస్తోంది.

కండోమ్ అమ్మకాలతో పాటు.. ఫ్యామిలీ ప్లానింగ్ ఉత్పత్తులైన ఐపిల్.. పెగ్రెన్సీ టెస్టింగ్ కిట్లు.. హైదరాబాద్.. ఢిల్లీ.. బెంగళూరు.. ఫుణె.. గురుగ్రామ్ లలో ఎక్కువగా అమ్ముడైనట్లుగా తేలింది. జైపూర్ లో కూడా ప్రెగ్నెసీ టెస్టింగ్ కిట్లకు ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లుగా తేలింది.