Political News

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదూరం అయినా వెళ్లడానికి ఏమాత్రం వెనుకాడని రాజు…ఆయా సందర్భాల్లో తనకు ప్రమాదం పొంచి ఉన్నా కూడా వెనుకాడకుండా సాగుతారు. ప్రజా ప్రతినిధిగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న రాజు… తాజాగా న్యాయవాదిగానూ తనకు తిరుగు లేదని నిరూపించారు. హైకోర్టునే తన వాదనతో మెప్పించిన రాజు… తన వాదనకు అనుకూలంగా తీర్పువచ్చేలా చేసుకున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజు.. నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామానికి వెళ్లిన రాజుపై అక్కడి దళితులు దాడికి యత్నించారన్న వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గ్రామంలో రామాలయాన్ని నిర్మించే దిశగా రాజు సాగగా… ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గ్రామ దళితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… రాజుపై దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

జైలు నుంచి విడుదలైన నిందితులు తాజాగా గ్రామంలో రామాలయ నిర్మాణం జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్న రాజు… రామాలయం నిర్మాణానికి ఎలా అనుమతులు రావో చూస్తానంటూ రంగంలోకి దిగారు.

తన తరపు వాదనలు వినిపించేందుకు లాయర్ ను పురమాయించే శక్తి తనకున్నా… రాజు తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధపడ్డారు. ఈ దరిమిలా బుధవారం ఈవ్యవహారంలోపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టగా… తన తరఫు వాదనలను రాజు స్వయంగా కోర్టుక వినిపించారు.

ఈ విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ కోర్టులో ఏం జరిగిందన్న వివరాలను అందజేశారు. పిటిషనర్లు కోరుతున్నట్లుగా రామాలయం నిర్మాణంపై ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వరాదని తాను కోర్టును కోరానని ఆయన తెలిపారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా అదే వాదనలను వినిపించడంతో తన, ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు… రామాలయం నిర్మాణంపై ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తన వాదన అని, అదే విషయాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు మరోరకంగా చెబతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

This post was last modified on April 15, 2026 10:23 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

10 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago