Political News

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వర్మ… నియోజకవర్గంపై తనదైన శైలి పట్టు సాధించారు. పిఠాపురంలో టీడీపీ తరఫున వర్మ పోటీ చేస్తున్నారంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి.

అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టిన జనసేన పిఠాపురం నుంచి తన అధినేత పవన్ పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో పవన్ కోసం వర్మ పిఠాపురం సీటును త్యాగం చేశారు. ఈ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా వర్మను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని పవన్ అనగానే… చంద్రబాబు ఒకే చెప్పేశారు. ఆ సమయంలో అప్పటికే పోటీకి సర్వసన్నద్ధమైన వర్మను పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కోసం సీటు త్యాగం చేసే మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు.

అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి వస్తే… ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే మూడు పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్లనూ పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేకపోయారు.

తాజాగా బుధవారం పార్టీకి నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ చంద్రబాబు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ కు పార్టీలో ప్రమోషన్ ఇచ్చి… పార్టీ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి పదవిని ఇచ్చారు.

అదే సమయంలో వర్మ త్యాగాన్ని కూడా గుర్తు చేసుకున్న చంద్రబాబు… వర్మను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు 16 మంది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల జాబితాలో వర్మ పేరు కూడా చేరిపోయింది. ఈ జాబితాను చూసిన వారంతా… పవన్ కోసం సీటును త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు న్యాయం చేశారన్న విశ్లేషణలు చేస్తున్నారు.

This post was last modified on April 15, 2026 10:08 pm

Share

Recent Posts

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

1 hour ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

3 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

4 hours ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

5 hours ago