Political News

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌ను ప్ర‌స్తావిస్తూ.. దానిని కొనియాడుతూ.. మ‌రోవైపు అమ‌రావ‌తి వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌త నాలుగు రోజులుగా వ‌రుస‌గా మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న మాజీ మంత్రి వైసీపీ కీల‌క నాయ‌కుడు పేర్ని నాని త‌న మ‌న‌సులోని మాట‌ను మ‌రోసారి బ‌య‌ట పెట్టారు.

అమ‌రావ‌తిని తామేమీ అడ్డు కోవ‌డం లేద‌న్నారు. అయితే.. అమ‌రావ‌తిని ఎవ‌రూ అడ్డుకోకుండా.. దానంతట అదే ఆగిపోయే శాపం దానికి ఉంద‌ని తీవ్ర వ్యాఖ్యానించారు. “ఎవ‌రో ప‌నిగట్టుకుని అమ‌రావ‌తిని ఆపే యాల్సిన అవ‌స‌రం లేదు. అయినా.. ఆ పాపం మాకెందుకు?. చంద్ర‌బాబు ప్రారంభించిన అమ‌రావ‌తికి.. చంద్ర‌బాబుకు శాపం ఉన్న‌ట్టుగానే అమ‌రావ‌తికి కూడా శాపం ఉంది. “ అని వ్యాఖ్యానించారు. “చుక్క చినుకు ప‌డితే.. ఆగిపోవ‌డం అనేది అమ‌రావ‌తికి ఉన్న శాపం“ అని చెప్పారు.

మ‌రో నెల రోజుల్లో రాష్ట్రంలో వ‌ర్షాకాలం ప్రారంభం అవుతుంద‌ని.. అప్పుడు ఎవ‌రూ ఆప‌కుండానే..ఎవ‌రి చ‌ర్య‌లు లేకుండానే అమ‌రావ‌తి నిర్మాణాలు వాటంత‌ట అవే ఆగిపోతాయ‌ని ఎద్దేవా చేశారు. “నెల రోజులు ఆగండి.. నాలుగు చినుకులు ప‌డితే అమ‌రావ‌తి అదే ఆగిపోతుంది.“ అన్నారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యు రాలు రేణుకా చౌద‌రిపైనా పేర్నినాని వ్యాఖ్య‌లు చేశారు.

“ప‌సుపు ర‌క్తం ప్ర‌వహిస్తున్న సంస్కారం లేని మృగాలు మొరుగుతున్నాయి“ అని అన్నారు. ఇటీవ‌ల ఆమె పార్ల‌మెంటులో అమ‌రావ‌తిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. దీనికి కౌంట‌ర్‌గా గ‌తంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌నే తాను అన్నాన‌న్న  రేణుల వ్యాఖ్య‌ల‌పై పేర్ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

This post was last modified on April 15, 2026 7:28 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago