Political News

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ మమతా బెనర్జీ పాలన సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సహా వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. దీనితో ఇక్కడ పాగా వేయాలన్నది బిజెపి నాయకులు పెట్టుకున్న భారీ లక్ష్యం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి బిజెపి అగ్ర నేతల వరకు కూడా పశ్చిమబెంగాల్లో పాగావేసి మరి ప్రచారం చేస్తున్నారు.

అయితే అధికారం ఎవరికి దక్కుతుంది.. దక్కదు.. అనే విషయాలను పక్కన పెడితే.. తాజాగా వెలుగు చూసిన ఒక కీలక సంఘటన బిజెపికి మైనస్ గా మారింది. “ముస్లిం మైనారిటీ ఓట్లను చేల్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నం ఇదీ“ అంటూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌కు సంబంధించిన‌ వీడియోను విడుదల చేశారు. ఇది తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వారి ఓట్లను కొనుగోలు చేసేందుకు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఒప్పందం జరిగిందన్నది మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణ.

దీనికి సంబంధించి ఒక వీడియోను సైతం ఆమె పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం సొంత పార్టీ పెట్టుకుని.. మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హుమాయున్ కబీర్ బిజెపి నాయకులతో చర్చిస్తున్నట్టుగా ఉంది. సుదీర్ఘ కాలం పాటు టీఎంసీ నాయకుడిగా ఉన్న కబీర్.. బెనర్జీతో విభేదించి `ఆమ్‌ జనతా పార్టీ`ని పెట్టుకున్నారు. ఇప్పుడు అదే పార్టీ బిజెపితో చేతులు కలిపిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు మేరకు ఇరుపాక్షాల మధ్య ఒప్పందం జరిగిందని సదరు వీడియోలో ఉన్నట్టు చెబుతున్నారు. తద్వారా మైనారిటీ నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చేందుకు అదేవిధంగా మైనారిటీ ఓట్లను కొనుగోలు చేసేందుకు కబీర్ బిజెపికి సహకరిస్తున్నారని మమత చెబుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కబీర్ కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలను కూడా అప్పగించాలన్న ఒప్పందం జరిగిందని మమత ఆరోపించారు.

దీనికి సంబంధించిన ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోను ఆమె విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో ముస్లింలను కబీర్ అవమానిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపించటం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ముస్లింల కోసం తనేమీ కంకణం కట్టుకోలేదని, రాజకీయాలను రాజకీయంగానే చూస్తానని కబీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డబ్బుకు ఏదైనా సాధ్యమవుతుందని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.  

మొత్తంగా 1000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందనే విషయం కూడా స్టింగ్‌ ఆపరేషన్ చేసిన వీడియోలో వినిపించటం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది. మరో 10 రోజుల్లో అసెంబ్లీ తొలి దశ ఎన్నికల జరుగుతున్న బెంగాల్లో ఈ వీడియో తమకు లాభరిస్తుందని మమతా బెనర్జీ అంచనా వేసుకుంటున్నారు. అయితే.. ఇది ఏఐ వీడియో అని క‌బీర్ చెబుతున్నా.. ముస్లింలు మాత్రం న‌మ్మ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 11, 2026 6:58 pm

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

40 seconds ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

5 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

58 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago