Movie News

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు చెందిన స్టాండ‌ప్ క‌మెడియ‌న్ అనుదీప్ క‌టికాల.. ఇటీవ‌ల ఒక షోలో చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమార‌మే రేపాయి. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యురాలైన కొణిదెల నిహారిక‌.. విడాకులు తీసుకునే సంద‌ర్భంలో, త‌మ కుటుంబంలో డైవ‌ర్స్ తీసుకోవ‌డంలో ఎంతో అనుభ‌వ‌మున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ల‌హా తీసుకున్న‌ట్లు చెబుతూ ఒక షోలో కామెడీ పండించ‌డానికి ట్రై చేశాడు అనుదీప్.

అత‌డి కామెంట్స్ చూస్తే ఎవ్వ‌రికైనా టూమ‌చ్ అనిపించ‌క మాన‌వు. న‌వ్వించ‌డం కోసం మ‌రీ ఈ స్థాయికి దిగజారిపోవాలా అంటూ అనుదీప్ మీద తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఈ వీడియోలు చూసి తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో అనుదీప్‌ను ఆటాడేసుకుంటున్నారు అభిమానులు.

ఐతే ఆన్ లైన్ ట్రోలింగ్‌తో స‌రిపెట్ట‌కుండా.. కొంద‌రు అభిమానులు అనుదీప్ స్టాండ‌ప్ కామెడీ షోలు నిర్వ‌హించే చోటుకు వెళ్లిపోయారు. అనుదీప్ ది స్ట్రీట్ కామెడీ క్ల‌బ్‌లో షోలు చేస్తుంటాడ‌ని తెలుసుకుని అక్క‌డికి.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉడే మెగా అభిమానుల‌ గ్యాంగ్ వెళ్లింది.

అక్క‌డో కమెడియ‌న్ షో చేస్తుంటే ఆడిటోరియంలోకి వెళ్లి.. అనుదీప్ కోసం ఆరా తీసింది. అత‌ను రాలేద‌ని తెలిసి ఫ్యాన్స్ త‌న‌పై బూతుల వ‌ర్షం కురిపించారు. ప‌ద్ధ‌తిగా కామెడీలు చేసుకోకుండా ప‌ర్స‌న‌ల్స్‌లోకి వ‌స్తారా అంటూ అభిమానులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

అనుదీప్ ఇక్క‌డికి రావాలని అరుస్తూ అత‌ణ్ని బండ బూతులు తిట్టారు. అభిమానుల అగ్ర‌హం చూస్తుంటే.. అనుదీప్ దొరికితే వీళ్లేం చేస్తారో అనిపించ‌కుండా ఉండ‌దు. అనుదీప్ వ్యాఖ్య‌ల విష‌యంలో అభ్యంత‌రాలుంటే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని, కేసులు పెట్టాల‌ని సూచించ‌గా.. ముందు అత‌ను బ‌య‌టికి వ‌స్తే త‌న సంగ‌తి చూస్తామంటూ అభిమానులు హెచ్చ‌రించారు.

This post was last modified on April 11, 2026 10:56 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

29 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

43 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

1 hour ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago