అప్పులు.. వివాదాలు.. అక్రమ తుపాకులు.. డ్రగ్స్ వ్యవహారం.. పన్నుల ఎగవేత- ఇవీ ఇతమిత్థంగా అమెరికా మాజీ అధ్యక్షు డు జోబైడెన్ పుత్రరత్నం హంటర్ బైడెన్ ప్రత్యేకతలు. దీంతో కేసులు ముసురుకున్నాయి. ఇంకేముంది.. చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రి దేశం వదిలి వెళ్లిపోయారు. అయితే.. ఆయన ఎప్పుడు దేశం వదిలి వెళ్లారు.. ఎక్కడికి వెళ్లారు? ఏ దేశంలో తలదాచుకుంటున్నారన్న వివరాలు అమెరికా ప్రభుత్వానికే తెలియలేదు. తాజాగా ఈయనకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా.. ఆయన తరఫు లాయర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ క్రమంలో లాయర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్య కోర్టును సైతం విస్మయానికి గురి చేశాయి. “హంటర్ బైడెన్ అనేక అప్పులు చేశారు. వారికి ఇవ్వలేదు. కానీ.. నా ఫీజు సంగతేంటి? నాకు 50 వేల డాలర్ల వరకు ఫీజులు చెల్లించాలి. అవి కూడా ఇవ్వలేదు. నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు“ అని న్యాయవాది అనగా.. మీరు కూడా కేసు పెట్టండి(యూ ఫైల్ ఏ పిటిషన్) అని న్యాయమూర్తి సూచించారు. ఇక, హంటర్ బైడెన్‌పై పలు కేసులు ఇప్పటికే నమోదు కాగా.. ఆయన తండ్రి జో బైడె్న్ హయాంలో అక్రమ ఆయుధాల కేసులను అధ్యక్ష హోదాతో రద్దు చేశారు.
56 ఏళ్ల హంటర్.. వృత్తి రీత్యా న్యాయవాది. తర్వాత.. ఆయన స్నేహితులతో కలిసి వ్యాపారవేత్తగా ఎదిగారు. హంటర్ బైడెన్ 2013లో చైనా సంస్థ బీహెచ్ ఆర్‌తో కలిసి కూడా వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అప్పుల పాలయ్యారన్న చర్చ ఉంది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ సహజ వాయువు ఉత్పత్తిదారులలో ఒకటైన బురిస్మా హోల్డింగ్స్ బోర్డులో పనిచేశారు. అతను లాబీయింగ్ సంస్థలకు లాబీయిస్ట్‌గా, న్యాయ ప్రతినిధిగా, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్టర్‌గా వ్యవహారించారు.
ఎంత ఎగ్గొట్టారంటే..
భారత కరెన్సీలో హంటర్ బైడెన్.. దాదాపు 158 కోట్ల రూపాయల వరకు ఎగ్గొట్టినట్టు అధికారులు కేసు నమోదు చేశారు. ఇది అమెరికా కరెన్సీలో 170 లక్షల డాలర్లుగా ఉంటుంది. డ్రగ్స్ సరఫరా ముఠాలతోనూ.. హంటర్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా తుపాకులను అక్రమంగా నిల్వ చేయడం.. వినియోగించడం వంటి కేసులు కూడా ఉన్నాయి.
అయితే..ఈ రెండు కేసులను కూడా జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న చివరి రోజుల్లో తన విచక్షణ, ప్రత్యేక అధికారాలను వినియోగించి కొట్టివేశారు. వాస్తవానికి 2024లో కోర్టు ఈ రెండు అంశాల్లోనూ హంటర్‌ను దోషిగా నిర్ధారించింది. శిక్ష ఖరారు చేయాల్సిన సమయంలో అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ జోక్యం చేసుకుని.. వాటిని రద్దు చేశారు. కాగా.. ఇప్పుడు దేశం విడిచి పారిపోవడంతో అమెరికా ఆయనను `వాంటెడ్ లిస్టు`లో పెట్టడం గమనార్హం.
This post was last modified on April 11, 2026 9:55 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…