వైసీపీ కీల‌క నేత‌కు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సాయం..?

రాజ‌కీయాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ముగ్గురు టీడీపీ ముఖ్య‌నేత‌లు ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సాయం చేయ‌బోయి అధిష్టానంకు అడ్డంగా దొరికిపోయారు. కేవ‌లం కాసుల క‌క్కుర్తితోనే వీరు ఇలా చేశార‌న్న విష‌యం కూడా బ‌య‌ట‌కు పొక్క‌డంతో జిల్లా టీడీపీ నాయ‌కులు, కేడ‌ర్ కూడా ఇప్పుడు ఆ ముగ్గురు టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు.

కేడ‌ర్ మ‌నోభావాల‌తో సంబంధం లేకుండా కాసులకు అల‌వాటు ప‌డి ఇంత ప‌నిచేస్తారా ? అని షాక్ అవుతున్నారు. అస‌లు విష‌యంలోకి వెళితే కాకినాడ జిల్లా రైస్ మిల్ల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు సూర్య ప్ర‌కాష్ స్టేట్ రైస్ మిల్ల‌ర్ల అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు రైస్ మిల్ల‌ర్ల అసోసియేష‌న్‌పై మంచి ప‌ట్టు ఉంది. వాళ్ల ఫ్యామిలీ సుదీర్ఘ‌కాల‌లంగా రైస్ వ్యాపారంలో మంచి ప‌ట్టు సాధించింది. సూర్య ప్ర‌కాష్ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌డం ఇష్ఠంలేని స‌ద‌రు వైసీసీ నేత వెంట‌నే టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. సూర్య‌ప్ర‌కాష్‌కు స‌పోర్ట్ చేయ‌వ‌ద్ద‌ని వారితో చెప్ప‌డంతో పాటు వారికి మంచి డీల్ కూడా సెట్ చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం జిల్లా రైస్ మిల్ల‌ర్ల అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న సూర్య ప్ర‌కాష్‌ను అవిశ్వాసం పెట్టేసి జిల్లా అధ్యక్ష ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తే అప్పుడు నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్ర అధ్య‌క్షుడిగా పోటీ చేయ‌డం కుద‌ర‌దు.

ఈ క్ర‌మంలోనే త‌న అనుచ‌రుడిగా ఉన్న వ్య‌క్తిని ఆ ప‌ద‌విలో కూర్చోపెట్టాల‌ని కూడా ప్లాన్ చేసుకున్నార‌ట స‌ద‌రు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. స‌ద‌రు వైసీపీ నేత‌తో డీల్స్ కుదుర్చుకున్న ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఉన్న రైస్ మిల్ల‌ర్ల‌తో మీటింగులు పెడుతూ సూర్య‌ప్ర‌కాష్‌ను దింపేయాల‌ని చెపుతున్నార‌ట‌.

ఈ ముగ్గురు టీడీపీ నేత‌ల‌లో ఇద్ద‌రు మాజీ మంత్రులు కూడా ఉండ‌డం విశేషం. ఈ ముగ్గురు నేత‌లు వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో డీల్స్ కుదుర్చుకున్న మ్యాట‌ర్ అధిష్టానం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో అధిష్టానం వీళ్ల‌కు గ‌ట్టిగా క్లాస్ పీకేసింద‌ట‌.

ఆ స‌ద‌రు వైసీపీ నేత గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో టీడీపీలో కీల‌క నేత‌లు, చంద్ర‌బాబు, లోకేష్ మీద ప‌రిధి దాటేసి మాట్లాడారు. వైసీపీ నేత నుంచి డ‌బ్బులు తీసుకున్న ఆ ముగ్గురు టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వానికి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఇప్పుడు జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న సూర్య‌ప్ర‌కాషే అధ్య‌క్షుడిగా ఉంటారు. ఈ విష‌యంలో ఎవ్వ‌రు చెప్పినా వినం అని చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అయ్యార‌ట‌. చివ‌ర‌కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నుంచి డ‌బ్బులు తీసుకున్న ఆ ముగ్గురు నేత‌లు తేలుకుట్టిన దొంగ‌ల్లా ఉండిపోయార‌ట‌. అది అస‌లు సంగ‌తి..!