Political News

రావాలి జగన్..కావాలి మావిగన్!

‘‘రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్… రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్….’’ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పాట మార్మోగింది. జగన్ గెలుపునకు ఈ పాట దోహదం చేసిందని వైసీపీ నేతలు అంటుంటారు.

ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం రూపొందించిన పాట యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ కూడా సొంతం చేసుకోవడం మరో విశేషం. అందుకే కాబోలు…తమకు అచ్చొచ్చిన ఈ పాట పల్లవిని వైసీపీ శ్రేణులు మరోసారి వాడేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అందుకే, ’‘రావాలి జ‘గన్’..కావాలి మావి‘గన్’..’’ అంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు భారీ సైజులో ఫ్లెక్సీలు వెలిశాయి.

జగన్ చెప్పిన మావిగన్ థియరీపై ఇటు ఓ వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే, జగన్ చెప్పిన మావిగన్ థియరీని వైసీపీ నేతలు, కార్యకర్తలు సమర్థిస్తూ కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మావిగన్ గురించి జగన్ మరోసారి మాట్లాడడంతో వైసీపీ శ్రేణులు మావిగన్ పై ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు. రావాలి జగన్..కావాలి జగన్ పాట స్ఫూర్తితో రావాలి జగన్.. కావాలి మావిగన్ అంటూ క్యాచీ లైన్లతో ప్రజల్లోకి మావిగన్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని, మావిగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, ఏపీ బాగుండాలన్నా, త్వరగా డెవలప్ కావాలన్నా మావిగన్ కారిడార్ రావాల్సిందేనని, జగన్ సీఎం కావాల్సిందేనని ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే, ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఏపీకి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిన జగన్.. మరో ఛాన్స్ ఇస్తే పబ్జీలో గన్ తో ఆడుకున్నట్లు మావి‘గన్’ తో రాష్ట్రంతో ఆడుకుంటారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

This post was last modified on April 9, 2026 2:48 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

25 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

33 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

37 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

58 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago