Political News

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఓకే అంటున్నా.,.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా పవన్ అడిగినంతనే పిఠాపురం అభివృద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీనికి కేంద్రంలో పవన్ కు మంచి పట్టే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ ఇటీవలే కేంద్రం వద్ద ఓ ప్రతిపాదన పెట్టిన సంగతి తెలిసిందే. జనవరిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిని ఈ సందర్భంగా ప్రస్తావించిన పవన్… అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్…బీజేపీకి ఎంత బాసటగా నిలుస్తున్నారో తెలిసిన కేంద్రం… ఆయన ప్రతిపాదనకు తక్షణమే ఆమోద ముద్ర వేసింది.

పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక చేసినట్టు తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ కు కొత్త రూపురేఖలు రానున్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.37.25 కోట్లను వెచ్చిందనుంది. త్వరలోనే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. పనులన్నీ పూర్తి అయితే పిఠాపురం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ల మాదిరిగా సరికొత్త రూపులో దర్శనమివ్వనుంది. అక్కడి ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

This post was last modified on April 6, 2026 8:02 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

15 minutes ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago