Political News

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే విష‌యంలోనూ.. కార్య‌క్రమాల‌కు పిలిచే విష‌యంలోనూ ఇలానే చేశార‌న్న‌వాద‌న ఉంది. అంతేకాదు.. ఒక్క‌సారి 2019, మేలో జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం.. ఆయ‌న చేసిన ప్ర‌సంగం వింటే కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న‌లు.. పిలుపులు గోచ‌రిస్తాయి.

రెండు ప‌త్రిక‌లు.. మూడు చానెళ్ల‌ను త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన(అప్ప‌ట్లో) జ‌గ‌న్‌.. ఆ పేప‌ర్ల‌ను చ‌ద‌వొద్ద‌ని.. ఆ చానెళ్ల‌ను చూడొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. వాస్త‌వానికి పార్టీ అధ్య‌క్షుడిగా.. ఒక పార్టీకి అధినేత ఆయ‌న ఎలాంటి పిలుపు అయినా ఇవ్వొచ్చు. కానీ.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే.. అదే వేదిక‌పై గ‌వ‌ర్న‌ర్ స‌హా పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌(అప్ప‌టి) స‌మ‌క్షంలోనే తెలుగు మీడియాపై అక్క‌సు వెళ్లగ‌క్కారు.

అనంతరం.. దీనికి ముందు కూడా.. జాతీయ మీడియాను జ‌గ‌న్ పిలుచుకుని ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే.. ప్ర‌త్యేకంగా వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో జాతీయ‌స్థాయిలో  జ‌గ‌న్ పేరు వినిపించింది. అంతెందుకు.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపిస్తూ.. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి విష‌యం తెలిసిందే.(2024 చివ‌రిలో).

ఆ కార్య‌క్రమాల క‌వ‌రేజీకి కూడా.. జాతీయ మీడియాను జ‌గ‌న్ ఆహ్వానించారు. ఇలా.. త‌న‌కు అవ‌స‌రం .. అవ‌కాశం ఉన్న ప్ర‌తిసారీ జాతీయ మీడియాను వాడుకునే జ‌గ‌న్‌.. ఇప్పుడు అదే మీడియాపై క‌రప్ష‌న్ (అవినీతి-అమ్ముడు పోవ‌డం) అనే వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిని జాతీయ మీడియా సంఘాలు కూడా ఖండించాయి. కానీ.. తాను స‌రైన విధానాలు అనుస‌రిస్తే.. ఏ మీడియా మాత్రం విమ‌ర్శిస్తుంది..? అనేది ఆలోచ‌న చేయాలి.

ఒక‌వేళ విమ‌ర్శించినా.. అప‌వాదులు ఉన్నాయ‌ని భావించినా.. వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు జ‌గ‌న్ కు అవ‌కాశం ఉంది. కానీ, ఆయ‌న అమ్ముడు పోయారంటూ.. చేసిన వ్యాఖ్య‌ల‌తో జాతీయ మీడియా జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతోంది. ఒక‌ప్పుడు నిల‌బెట్టిన మీడియాపైనే జ‌గ‌న్ ఇలా ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌ట్ల ఎడిట‌ర్స్ గిల్డ్ కూడా ఆక్షేప‌ణ వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 6, 2026 12:15 am

Share

Recent Posts

ఏఐ సినిమా… ఫోన్లో చూసి మురిసిపోవడమే

మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…

4 minutes ago

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

16 minutes ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

51 minutes ago

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

2 hours ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

3 hours ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

3 hours ago