Movie News

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు విజయ్ జన నాయకుడు రిలీజయ్యే అవకాశాలు పుష్కలంగా ఉందటతో దాని వల్ల తమ సినిమా ప్రభావితం చెందుతుందని ఆందోళన చెందుతున్నారు. టైటిల్ లో చెన్నై ఉంది కాబట్టి తమిళనాడు జనాలకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భావించారో ఏమో కానీ మొత్తానికి ప్రమోషన్ల స్పీడ్ అయితే ఇంకా పెంచాల్సి ఉంది. విడుదల కేవలం పన్నెండు రోజుల దూరంలో ఉంది.

వాస్తవిక కోణంలో చూసుకుంటే చెన్నై లవ్ స్టోరీ కూల్ గా ఉండొచ్చు. ఎందుకంటే జన నాయకుడు ప్రభావం విజయ్ స్వంతరాష్ట్రం, ఓవర్సీస్ లో ఎక్కువగా ఉంటుంది. ఏపీ తెలంగాణలో తనకు క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ భగవంత్ కేసరి రీమేక్ కావడం వల్ల అధిక శాతం ఆడియన్స్ థియేటర్లలో చూసేందుకు మొగ్గు చూపిస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా ప్రీ రిలీజ్ టాక్ యునానిమస్ గా లేదు. ఓవర్ మాస్ ఎలిమెంట్స్ మన జనాలకు అంత సులభంగా కనెక్ట్ కావు.

మణిశర్మ సంగీతాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చిన చెన్నై లవ్ స్టోరీ మీద ప్రీ వైబ్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. పైకి ఏదో రామ్ కామ్ లా కనిపించినా ఊహించని మలుపులు, ఎమోషన్లతో ఆడియన్స్ కి కొత్త అనుభూతి ఇస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రచయిత కం నిర్మాత సాయి రాజేష్ మార్కెటింగ్ లో అంతా తానై ముందుకు నడిపిస్తున్నారు. బేబీని మించి ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇది నిజమైతే ఇంకో హిట్టు పడ్డట్టే.

చెన్నై లవ్ స్టోరీతో తన మార్కెట్ మరింత బలపడుతుందనే నమ్మకం కిరణ్ అబ్బవరంలో కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చే టైంకి లెనిన్ రెండు వారాలు పూర్తి చేసుకుని ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి సమస్య ఉండదు. కాకపోతే టాక్ చాలా కీలకం కానుంది. జూలై 24 జన నాయకుడు వచ్చినా రాకపోయినా కిరణ్ కొచ్చిన సమస్య అయితే ప్రాక్టికల్ గా లేదు. ఒకవేళ విజయ్ సినిమా స్ట్రెయిట్ సబ్జెక్టు అయ్యుంటే మటుకు ఆలోచించాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుడా అవసరం లేదు. 

This post was last modified on July 12, 2026 10:18 am

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago