పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి. లెనిన్ తో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టేసినట్టే. టాక్స్ సంగతి ఎలా ఉన్నా కంటెంట్ పరంగా మాస్ జనాన్ని మెప్పించడంలో దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు సక్సెసయ్యారు. ముఖ్యంగా అఖిల్ కెరీర్ లో ఇప్పటిదాకా ట్రై చేయని జానర్ కావడం, తనకో విజయం దక్కాలని ఫ్యాన్ డంతో సంబంధం లేకుండా అందరూ కోరుకోవడం బహుశా ఇలాంటి ఫలితాన్ని ఇచ్చిందేమో.
గత ఇరవై నాలుగు గంటల బుక్ మై షోలో లెనిన్ టికెట్లు 2 లక్షల 60 వేలకు పైగా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో సెకండ్ షో చూద్దామంటే టికెట్ దొరికే పరిస్థితి లేదు. బిసి కేంద్రాల్లో కౌంటర్ సేల్స్ చాలా బాగున్నాయని, టైటిల్ కార్డు పడే టైంకి హౌస్ ఫుల్ బోర్డు పెడుతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. సండే పడే షోలన్నీ అఖిల్ డామినేషన్ లోనే ఉండబోతున్నాయి. అర సెంచరీ లాంఛనం ఇవాళ జరిగిపోతుంది.
కలెక్షన్ నెంబర్ల సంగతి పక్కనపెడితే లెనిన్ లాంటి జెన్యూన్ హిట్ కోసం మొహం వాచిపోయిన అక్కినేని అభిమానులకు ఇదో సంబరంగా మారిపోయింది. రికార్డులు ఎన్ని బద్దలవుతాయనేది పక్కనపెడితే ఇంత రెస్పాన్స్ వాళ్ళు ఊహించనిది. షూటింగ్ లో జాప్యం, హీరోయిన్ మారడం, విడుదల వాయిదాలు పడటం లాంటి ఎన్నో కారణాలు నమ్మకంతో పాటు అనుమానాలు కూడా పెంచుతూ వచ్చాయి. ఎట్టకేలకు అవన్నీ సెట్ అయినట్టే.
ఇదే దూకుడు ఇంకో వారం దాకా ఉంటుందానేది వేచి చూడాలి. ఎందుకంటే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు మొదటి వీకెండ్ ఊపు మీద ఉండటం సహజం. ఇదే జోరు కనక సోమవారం నుంచి కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ ముద్ర పడిపోతుంది. బ్రేక్ ఈవెన్ పరంగా ఎలాంటి టెన్షన్లు పెట్టుకోనక్కర్లేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు ఆల్రెడీ గంటకు 5 వేల టికెట్ల చొప్పున లెనిన్ బ్యాటింగ్ మొదలైపోయింది. రోజు అయిపోయే టైంకి ఎన్ని బౌండరీలు కొడతాడో చూడాలి.
This post was last modified on July 12, 2026 10:05 am
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…