బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. జెండా-అజెండాలపై ఆమె కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీపరంగా పుంజుకోవాలని అనుకుంటున్న ఆమె.. కేవలం కొత్తముఖాలపైనే ఆధారపడితే కుదరదు. వాస్తవానికి ఏ పార్టీకైనా ఇది సాధ్యంకాదు. ప్రజల బలం ఉన్న నాయకులు.. ప్రజల ఆమోదం ఉన్న నాయకులు ఏ పార్టీకైనా అవసరం అవుతారు. అందరినీ కొత్తవారిని పెట్టుకుంటే సాధ్యంకాదు.
గతంలో జనసేన పార్టీని పెట్టుకున్న పవన్ కల్యాణ్ సైతం..తొలుత కొత్తవారికి మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ, వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఆయన కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వక తప్పలేదు. ఇది ఎన్నికల రాజకీయం. పైకి చెప్పినంత తేలికగా అయితే.. ఏదీ ఉండదు. కొత్త ముఖాలను తీసుకుని.. కండువా కప్పినంత ఆనందంగా కూడా.. రాజకీయాలు ముందుకు సాగవు. కాబట్టి సీనియర్లు.. రాజకీయ ఉద్ధండులకు అవకాశం ఇవ్వకతప్పదు. ఇప్పుడు ఇలానే.. కవిత పార్టీలోకి కూడా సీనియర్ల అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. గతంలో బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన కొందరు మాజీ మంత్రులు, సీనియర్లు.. ఇతర పార్టీల్లో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీలో కొందరు.. కాంగ్రెస్‌లో ఇంకొందరు ఉన్నారు. అయితే.. వారికి ఆశించిన మేరకు ఫాలో యింగ్ లేదు. అంటే.. ఆయా పార్టీలలో వారికి గుర్తింపు లేదు. పైగా ఆధిపత్య రాజకీయాలతో అలసిపోతున్నారు.ఈ క్రమంలో ఇలాంటి వారు.. తమకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటున్నారు. తాజాగా కవిత పార్టీ వారికి తురుపు ముక్కగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.
కానీ.. ఇదే ఇప్పుడు కవితకు సంకటంగా మారనుందని చర్చ సాగుతోంది. వాస్తవానికి ఇతర పార్టీల్లో చేరిన బీఆర్ ఎస్ నాయకులు కవిత కంటే కూడా సీనియర్లు. పైగా.. వారంతా.. రాజకీయంగా డక్కాముక్కీలు తిన్నవారే. ఈ క్రమంలో అలాంటివారిని పార్టీలో చేర్చుకుంటే.. `నెంబర్-2` అధికార కేంద్రాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఉదాహరణకు మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారు.
ఆయన కనుక కవిత పార్టీలోకి వస్తే.. `సీనియార్టీ` ప్రభావం చూపుతుంది. పైగా నెంబర్-2 వంటి విధానపరమైన వివాదాలు కూడా వస్తాయి. ఒక్క ఈటలే కాదు.. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అలాగని వారిని కాదంటే.. సీనియర్లు లేక.. సలహాలు ఇచ్చేవారు కనిపించక.. పార్టీ ముందుకు సాగే అవకాశం ఉండదు. దీంతో ఏం చేయాలన్న విషయంపై కవిత సమాలోచనలు చేస్తున్నట్టు ఆమె అనుచరుల ద్వారా తెలుస్తోంది.
This post was last modified on April 6, 2026 12:13 am
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…