Political News

అజ్ఞాతంలో వైసీపీ మాజీ ఎంపీ?

వైసీపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారట. ఆది నుంచి నేరాలు, కేసులతో సహవాపం చేస్తూ సాగుతున్న సురేశ్.. ఎంపీ హోదాలో ఓ సంస్థకు చెందిన వ్యక్తెుల నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ పనిని పూర్తి చేయకపోగా… డబ్బును కూడా వాపస్ ఇవ్వలేదట. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… తుళ్లూరు పోలీసులు సురేశ్ పై కేసు నమోదు చేశారట. ఈ విషయం తెలుసుకున్న సురేశ్… తనను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.

సురేశ్ ప్రస్థానం అంతా నేరాలు, కేసులు, అరెస్టులతోనూ సాగిందని చెప్పాలి. 2014 తర్వాత నాడు టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయగా… రాజధానికి భూములు ఇవ్వకుండా రైతులను భయభ్రాంతులకు గురి చేసే నిమిత్తం ఓ చెరకు తోటకు సురేశ్ నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సురేశ్ ను అరెస్టు చేసిన పోలీసులు పలు విధాలుగా ఆయనను విచారించారు. ఈ అరెస్టుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరైన సురేశ్… ఆ తర్వాత బాపట్ల ఎంపీ టికెట్ ను దక్కించుకుని, ఎంపీగా కూడా విజయం సాధించారు.

ఇక తాజా కేసు వివకాల్లోకి వెళితే… కాకినాడకు చెందిన ఓ ట్రస్టు కారణమేమిటో తెలియదు గానీ కొంతకాలం క్రితం మూతపడింది. అయితే మూత పడ్డ ఆ ట్రస్టును తాను పునరుద్ధరిస్తానని, అందుకోసం తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని సురేశ్ చెప్పారట. ఓ ఎంపీ హోదాలో ఉన్న సురేశ్ మాటలు నమ్మిన సదరు వ్యక్తులు ఆయనకు రూ.25 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. అయితే డబ్బు తీసుకునేదాకా బాగానే ఉన్నా… డబ్బు చేతిలో పడ్డాక… సురేశ్ ఆ పనిని పక్కనపెట్టేశారట. డబ్బులు తిరిగి ఇమ్మన్నా కూడా ఇవ్వలేదనేది వారి వాదన.

అటు ట్రస్టు పునరుద్ధరణ కాక, ఇటు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శనివారం బాధితులను స్టేషన్ కు పిలిచిన తుళ్లూరు పోలీసులు… ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సురేశ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట.

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… ఓ వ్యక్తిని కొట్టిన కేసులో అరెస్టు అయిన సురేశ్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్య కూడా వచ్చింది. ఈ పరిణామాలను గుర్తు చేసుకున్న సురేశ్… అరెస్టు కాకుండా ఉండేలా పలాయనం బాట పట్టినట్టు వార్త చక్కర్లు కొడుతుంది. అయితే పోలీసులు ఆయన జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on April 5, 2026 5:09 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago