బాలీవుడ్లో చిన్న చిన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటున్న కంగనా రనౌత్‌ను పెద్ద స్టార్‌గా మార్చిన సినిమా.. క్వీన్. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల లిస్టు తీస్తే అందులో తప్పకుండా ఉండే సినిమా అది. ఎన్నో చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైన పురస్కారాలు గెలుచుకున్న క్వీన్.. బాక్సాఫీస్ దగ్గరా వసూళ్ల పంట పండించింది. 2013లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
వికాస్ బల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కంగనా పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెలో అంత మంచి నటి ఉందని అప్పటిదాకా ఎవరికీ తెలియదు. గ్లామర్ పాత్రలకు పరిమితమైన కంగనా.. స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. క్వీన్ తర్వాతే కంగనా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ పెద్ద రేంజికి వెళ్లింది. సినిమాల్లో వచ్చిన గుర్తింపుతో తర్వాత ఎంపీ కూడా అయింది.
ఐతే కొన్నేళ్లుగా కంగనా నటించిన సినిమాలేవీ సరిగా ఆడట్లేదు. చివరగా తనే దర్శకత్వం వహిస్తూ నటించిన ఎమర్జెన్సీ కూడా తుస్సుమంది. ఇలాంటి పరిస్థితుల్లో కంగనా.. మళ్లీ క్వీన్ అవతారం ఎత్తుతుండడం విశేషం. 13 ఏళ్ల కిందటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తోందీ ఫైర్ బ్రాండ్ హీరోయిన్.
క్వీన్ సినిమా తీసిన వికాస్ బల్‌యే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు. మళ్లీ అప్పటి టీం అంతా ఈ సినిమా కోసం కలుస్తోంది. ఈ చిత్రానికి క్వీన్ ఫరెవర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
ఐతే క్వీన్ సీక్వెల్ ఇప్పుడు వర్కవుట్ అవుతుందా అన్నది సందేహం. ఎందుకంటే కంగనా ఏ ఇమేజ్ లేని టైంలో క్వీన్ మూవీలో అమాయక అమ్మాయి పాత్రకు బాగా సూటైంది. తన పాత్రలోని అమాయకత్వమే ఆ సినిమాకు ప్లస్ అయింది. కానీ ఇప్పుడు కంగనా ఇమేజ్ మారిపోయింది. తనను జనం చూసే దృష్టికోణమే మారిపోయింది. మరోవైపు వికాస్ సైతం ఫాంలో లేడు. బలవంతంగా క్వీన్ కథను సాగదీస్తే జనాలకు ఏమేర రుచిస్తుందన్నదీ ప్రశ్నార్థకమే. మరి క్వీన్ సీక్వెల్ సత్ఫలితాన్నిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on April 5, 2026 10:21 am
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…