Movie News

పెద్దిపై నోరు విప్ప‌ని మృణాల్‌

ఓ భారీ చిత్రంలో కాస్టింగ్‌కు సంబంధించి ఆ సినిమా బృంద‌మే అధికారిక ప్ర‌క‌ట‌న చేయాలి త‌ప్ప‌.. అది జ‌ర‌గ‌క ముందు ఆర్టిస్టులు నోరు విప్ప‌రు. అందులోనూ పెద్ద హీరోయిన్లు స్పెష‌ల్ సాంగ్స్ లాంటివి చేస్తుంటే.. వాళ్లు దాని గురించి మీడియా వాళ్లు అడిగినా బ‌దులివ్వ‌రు. టీం నుంచే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తేనే బాగుంటుంద‌ని మౌనం వ‌హిస్తారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా అదే ప‌ని చేసింది. 

ఈ ముంబ‌యి భామ.. రామ్ చ‌ర‌ణ్ కొత్త చిత్రం పెద్దిలో ఐటెం సాంగ్ చేస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో హైలైట్ అవుతుంద‌ని భావిస్తున్న ఆ పాట గురించి సామాజిక మాధ్య‌మాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. తాను క‌థానాయిక‌గా న‌టించిన డెకాయిట్ మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో పెద్ది స్పెష‌ల్ సాంగ్ గురించి అడిగితే.. మృణాల్ స‌మాధానం దాట‌వేసింది. డెకాయిట్ గురించే ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని ఆమె ఒక‌టికి రెండుసార్లు నొక్కి వ‌క్కాణించింది.

పెద్దిలో మృణాల్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌న‌ట్ల‌యితే.. తాను అందులో భాగం కాద‌ని చెప్పేసి ఉండొచ్చు. స‌మాధానం దాట‌వేసింది అంటే ఆమెను ఆ పాట‌లో చూడ‌బోతున్న‌ట్లే భావించాలి. ఇక తెలుగులో తాను మిస్స‌యిన పెద్ద‌ సినిమాల గురించి మృణాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

సీతారామం, హాయ్ నాన్న సినిమాల త‌ర్వాత త‌న‌కు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని ఆమె వెల్ల‌డించింది. ఆ సినిమాల ప్యాకేజీ చాలా టెంప్టింగ్‌గా అనిపించింద‌ని కూడా ఆమె తెలిపింది. 

కానీ సీతామాల‌క్ష్మి, య‌శ్న పాత్ర‌ల‌ను త‌న‌కు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాయ‌ని.. తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌కు అత్యున్న‌త స్థాయిని ఇచ్చార‌ని.. అలాంట‌పుడు మామూలు పాత్ర‌లు చేసి వాటి విలువ త‌గ్గించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కొన్ని క్యారెక్ట‌ర్ల‌ను తిర‌స్క‌రించాన‌ని మృణాల్ తెలిపింది. గ‌త జ‌న్మ‌లో తాను ఏదో మంచి చేసి ఉంటే త‌ప్ప‌.. తెలుగు ప్రేక్ష‌కుల నుంచి త‌న‌కు ఇంత ప్రేమ దొర‌క‌ద‌ని.. సీతామాల‌క్ష్మి లాంటి పాత్ర చేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని ఆమె చాలా ఎమోష‌న‌ల్‌గా చెప్పింది.

This post was last modified on April 5, 2026 10:22 am

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

9 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

10 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago