Political News

కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్‌కు ఊహించ‌ని సంక‌టం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. క‌విత.. పాత `టీఆర్ ఎస్‌` పేరును వినియోగించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్ర‌క‌ట‌న తెలిసిందే. అంటే.. ఆమె పార్టీ పేరును టీఆర్ ఎస్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని కూడా ఆమెచూచాయగా చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంద‌ని.. ఎవ‌రైనా దీనిని వాడుకోవ‌చ్చ‌న్నారు. ఆ ఎవ‌రో అనేది చూస్తే.. ఆమేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంటే.. ఆది నుంచి వినిపించిన‌ట్టుగా.. `తెలంగాణ జాగృతి` కాకుండా.. తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ ఎస్‌) పేరునే వాడుకోవాల‌ని ఆమె దాదాపు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇది ప్ర‌జ‌ల్లో బాగా పాతుకుపోయిన పేరు కావడం.. గ్రామీణ స్థాయిలో ఇంకా టీఆర్ ఎస్ పార్టీగానే ఇప్ప‌టికీ కొన్ని చోట్ల ప్ర‌చారంలో ఉంది.

ఈ నేప‌థ్యంలో ఈ పేరును వాడుకుంటే.. క‌విత ప్ర‌చారం కానీ.. కొత్త పార్టీకానీ.. పుంజుకునేందుకు మ‌రింత స్పేస్ ఉంటుంద‌ని ఆమె ఆలోచ‌న‌గా ఉంది. ఈ నేప‌థ్యంలోనే `పాత పార్టీ కొత్త జెండా` అనే నినాదం చేశారు. ఈ వ్య‌వ‌హారం తెలియ‌గానే.. బీఆర్ ఎస్ అలెర్ట్ అయిన‌ట్టు తెలిసింది. దీనిపై ఎలాంటి చ‌ర్చ లేకుండా.. వెంట‌నే అడ్డుకునేందుకు.. ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలోని పార్టీ ఎంపీల ద్వారా.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో బీఆర్ ఎస్ త‌ర‌ఫున పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు తెలిసింది. `టీఆర్ ఎస్‌` పూర్తిగా త‌మ‌కు మాత్ర‌మే చెందిన పేరు అని.. దీనిని వేరే వారికి కేటాయించరాదని బీఆర్ ఎస్‌స‌ద‌రు పిటిష‌న్‌లో అభ్య‌ర్థించ‌నుంది.

స‌హ‌జంగా ఒక పార్టీ పేరును మార్చిన త‌ర్వాత‌.. ఆరు మాసాల వ‌ర‌కు పాత పార్టీ పేరును ఎవ‌రికీ కేటాయించ‌రాద‌న్న నిబంధ‌న ఉంది. కానీ.. టీఆర్ ఎస్ .. పార్టీ బీఆర్ ఎస్‌గా మారి దాదాపు మూడేళ్ల‌కుపైగానే అయింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది చూడాలి. ఎన్నిక‌ల సంఘం విచ‌క్ష‌ణ‌పైనే ఈ నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on April 4, 2026 9:05 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

7 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

7 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

8 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

10 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

10 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

10 hours ago