Political News

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న తీర్చి దిద్దుతున్నారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్ (సీ-డాక్‌) కేంద్రాన్ని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వర్గానికి ఆయ‌న తీసుకువ‌చ్చారు. స‌హ‌జంగా నియోజ‌క‌వ‌ర్గం అభివృధ్ధి అంటే.. వంతెన‌లు, కాల్వ‌లు, రోడ్ల నిర్మాణం అనే మాట‌ను ఆయ‌న చెరిపివేశారు.

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఐటీకి కేంద్రంగా తీర్చిదిద్దే క్ర‌మంలో సీ-డాక్‌ను తీసుకువ‌చ్చేందుకు ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ గ‌త మూడు మాసాలుగా ఎంతో కృషి చేస్తున్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో సేవలందిస్తున్న సి-డాక్.. తన 13వ కేంద్రాన్ని గన్నవరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గం పేరు రాష్ట్ర‌స్థాయి నుంచి ఇప్పుడు దేశ‌స్థాయికి చేరుకున్న‌ట్టు అయింది. ఈ సంస్థ ఏర్పాటుకు యార్ల‌గ‌డ్డ విశేషంగా కృషి చేశారు.

ఇక‌, ఈ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకుంటారు. గ‌న్న‌వ‌రంలో ఏర్పాటు చేస్తున్న సంస్థ‌కు సుమారు రూ.200 కోట్ల మేర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేసుకున్నారు. ఈ నిధుల‌ను కేంద్ర‌మే నేరుగా కేటాయించనుంది. డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న కేంద్రం.. దీనిలో భాగంగానే సీడాక్‌ను గ‌న్న‌వ‌రానికి కేటాయించింది. రాష్ట్రంలో `సీడాక్` సంస్థ ఉన్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గంగా కూడా గ‌న్న‌వ‌రం నిలుస్తుంది.

ఎన్నెన్నో ప్ర‌యోజ‌నాలు..

ఉన్నత-స్థాయి కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, సాంకేతికతలో సీడాక్ ఎంతో కీల‌కంగా మారింది. దేశంలో మొదటి సూపర్ కంప్యూటర్ `పరం` సిరీస్ అభివృద్ధి చేస్తుంది. అలాగే, క్వాంటం కంప్యూటింగ్, క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో పరిశోధనలు చేస్తుంది. ‘C-DAC ACTS’ ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, AI, VLSI, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాలలో PG డిప్లొమా కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది. ఇవి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉపాధి, ఉద్యోగాల‌ను క‌ల్పించ‌నున్నాయి.

This post was last modified on April 4, 2026 10:05 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

48 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago